ఫోటో స్టోరీ: మెగా హీరోయిన్ మెగా స్టైల్

Update: 2019-12-19 11:26 GMT
మెగా ఫ్యామిలీనుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి అమ్మాయి నిహారిక.  నాగేంద్రబాబు తనయగా టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారికకు ఎందుకో విజయం మాత్రం అందని ద్రాక్షలాగే ఉంది  నిహారిక ఇప్పటి వరకూ 'ఒక మనసు'.. 'హ్యాపీ వెడ్డింగ్'.. 'సూర్యకాంతం' చిత్రాలలో నటించింది.   అయితే ఇంకా నిహారిక ఆశించే హిట్ మాత్రం దక్కలేదు.  అయితే నిహారిక నిరాశపడకుండా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

నిన్న నిహారిక పుట్టినరోజు.  ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ సభ్యులే కాకుండా చాలామంది మెగా ఫ్యాన్స్ నిహారికకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య వరుణ్ తేజ్ తో కలిసి ఉన్న నిహారిక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే నిహారిక తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "మేక్ ఎ విష్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఫోటోలో వైట్ షర్టు.. బ్లూ కలర్ చిరుగుల జీన్స్ ధరించి ఎంతో స్టైల్ గా కుర్చీపైన కూర్చుంది. అభరణాలు ఏవీ లేవు కానీ ఒక చేతికి మాత్రం లావుపాటి బ్యాంగిల్స్ ధరించింది.  బాడీ లాంగ్వేజ్.. యాటిట్యూడ్ మాత్రం యమా స్టైల్ గా ఉంది.

నిహారిక ఈమధ్య 'సైరా' లో ఒక చిన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.  ఆ సినిమా తర్వాత ఏ సినిమా సైన్ చేసిందో ఇంకా వివరాలు తెలియదు కానీ తన సొంత బ్యానర్  'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' లో మంచి కంటెంట్ ఉండే వెబ్ సీరీస్ లను నిర్మించే ప్రయత్నాలు చేస్తోందట. ఒకవేళ తనకు సూటయ్యే పాత్ర ఉంటే వాటిలో నటించేందుకు కూడా ప్లాన్ చేస్తోందట.
Tags:    

Similar News