ఆనందంగా ఉన్నట్లుగా చెప్పి అంతలోనే ఆత్మహత్య!

Update: 2020-12-09 10:02 GMT
తమిళ బుల్లి తెర నటి విజే చిత్ర ఆత్మహత్య విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు సంబంధించి ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ఆత్మహత్యకు రెండు మూడు గంటల ముందు వరకు షూటింగ్‌ లో పాల్గొంది. లేట్‌ నైట్‌ వరకు షూటింగ్‌ లో పాల్గొన్న చిత్ర షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత అంటే చనిపోవడానికి కాసేపు ముందు ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఈ ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటోతో పాటు చాలా ఆనందంగా ఉన్నాను అంటూ ఈమోజీని షేర్‌ చేసింది. ఆ ఫొటోలో కూడా చిత్ర చాలా ఆనందంగా ఉన్నట్లుగా అనిపించింది.

ఫొటోకు భారీ ఎత్తున రెస్పాన్స్‌ వచ్చింది. చాలా అందంగా ఉన్నారని.. ఆనందంగా ఉన్నారంటూ కామెంట్స్‌ చేశారు. ఫొటో ట్రెండ్‌ అవుతున్న సమయంలోనే ఆమె చనిపోయినట్లుగా వార్త రావడం అందరికి షాక్‌ ఇచ్చినట్లయ్యింది. హోటల్‌ లో తనకు కాబోయే భర్తతో దిగిన చిత్ర రూంకు వెళ్లింది. ఎన్ని సార్లు పిలిచినా రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు తెలియజేయడంతో వారు వచ్చి రూంను ఓపెన్‌ చేశారు. రూంలో ఆత్మహత్య చేసుకుని చిత్ర ఉన్నారు. అందమైన ఫొటోను చివరి సారి షేర్‌ చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న చిత్ర విషయం ఒక మిస్ట్రీగా ఉంది.
Tags:    

Similar News