ఫోటో స్టోరీ: శ్వేతవర్ణం మాళవికం మోహనం!

Update: 2020-01-24 07:59 GMT
మలయాళ భామ మాళవిక మోహనన్ పేరు తెలుసా? తెలుగులో ఈ భామ నటించిన సినిమాలు ఇంకా విడుదల కాలేదు. విజయ్ దేవరకొండ 'హీరో' లో ఈ మాళవికే హీరోయిన్. అయితే ఆ సినిమా అసలు ఉందా లేదా అనే క్లిష్టమైన ప్రశ్నలను మనసులోకి రానివ్వకండి. ఒకవేళ ఆ సినిమా ఉంటే మాళవిక తెలుగు వారికి పరిచయం అవుతుంది.. లేకపోతే మరో సినిమాతో మన ముందుకు వస్తుంది. అయితే ఈ లోపు సోషల్ మీడియాలో నెటిజన్లను టీజ్ చెయ్యడం మాత్రం ఆపడం లేదు.

ఇప్పటి కే మలయాళం..కన్నడ.. తమిళం.. హిందీ భాషలను కవర్ చేసి ఆయా భాషల చిత్రాలలో నటించిన ఈ భామకు హాట్ గా కనిపించడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఈమధ్య మాళవిక ఒక ఫోటో షూట్ చేసింది. తన హాటు ఘాటు సంప్రదాయాలు.. గ్లామర్ ప్రతిష్ఠ ఏమాత్రం దెబ్బతినకుండా ఓ కత్తి లాంటి డ్రెస్సు వేసుకుని ఝకాస్ పోజులిచ్చింది. వైట్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ లో అందాల వడ్డన చేస్తూనే స్టైల్ గా కూర్చుంది. మేకప్ చక్క గా కుదిరింది.. హెయిర్ స్టైల్ అంతకంటే చక్కగా కుదిరింది.. ఫేస్ లో చిరునవ్వుతో కూడిన సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది.

ఈ ఫోటోకు.. ఫోటోలోని గ్లామరసానికి నెటిజన్ల హృదయాలు జిల్లుమన్నాయి. "ఇండియన్ అందం.. వెస్టర్న్ స్టైల్".. "కేరళ కోకోనట్ బాంబు".. "స్టన్నింగ్ బ్యూటీ" అంటూ వారి స్పందనలు తెలిపారు. ఇక మాళవిక సినిమాల విషయాని కి వస్తే తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా 'మాస్టర్' లో హీరోయిన్ గా నటిస్తోంది.


Tags:    

Similar News