టాలీవుడ్ కి నిరంతరం కొత్త కథానాయికలు వస్తూనే ఉంటారు. ఎవరి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వాళ్లు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. నాకు ఎవరూ పోటీ కాదు .. అని అందమైన కథానాయికలంతా ముద్దు ముద్దుగా చెబుతుంటారు గానీ, ఈ రోజున కెమెరా ముందుకు వచ్చిన కథానాయికలకు .. రేపు సెట్స్ పైకి వచ్చే కథానాయికలు పోటీనే. అందువల్లనే ఇక్కడ అవకాశాలను అందుకోవడం .. నిలదొక్కుకోవడం .. సక్సెస్ లను దొరకబుచ్చుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటేనే కెరియర్ గ్రాఫ్ ను ముందుకు తీసుకుని వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
అందం .. అభినయంతో పాటు గుప్పెడంత అదృష్టం .. చిటికెడంత లౌక్యం ఉంటేనే ఇక్కడ రాణించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇతర రాష్ట్రాలకో .. ఇంటికో వెళ్లిపోవలసిందే. అయితే ఇప్పుడు అంత అమాయకమైన కథానాయికలు అంతగా లేరనే చెప్పాలి. అందరూ బాగా చదువుకుని, ఇండస్ట్రీలో కాలు పెట్టిన దగ్గర నుంచి .. మళ్లీ ఆ కాలును బయటపెట్టేంతవరకూ లెక్కలు వేసుకుని మరీ రంగంలోకి దిగుతున్నారు. సాధ్యమైనంత వరకూ సమయాన్ని వృథా చేయకుండా కెరియర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. కాస్త అటు ఇటుగా అదే మ్యాప్ ను ఫాలో అవుతూ వెళుతున్నారు.
అయితే ఎంతగా ప్రణాళికలు వేసుకున్నప్పటికీ .. ఏ భాషలో నిలబడాలనుకున్నప్పటికీ కావలసింది సక్సెస్ మాత్రమే. అది ఉంటే అవకాశాలను ఎవరూ ఆపలేరు. పారితోషికం పెంచుకుంటూ వెళుతున్నా పట్టించుకోరు. ఎంత గ్లామర్ ఉన్నప్పటికీ .. ఎంతగా అందాలు ఆరబోసినప్పటికీ సక్సెస్ పడినప్పుడే ఆ ప్రయత్నం ఫలించినట్టు అవుతుంది .. లేదంటే నిరీక్షణను అలవాటు చేసేస్తుంది. ప్రస్తుతం నభా నటేశ్ అదే పరిస్థితుల్లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ముద్దుగా .. బొద్దుగా కనిపించే ఈ సుందరికి, గ్లామర్ పరంగా వంక బెట్టవలసిన పనిలేదు.
'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బాదుషా లాంటి అమ్మాయి, 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో చెలరేగిపోయింది. ఆ గ్లామర్ ధాటికి ఆమెను వెతుక్కుంటూ వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే అవేవి కూడా ఆమె కెరియర్ ను మరో స్థాయికి తీసుకుని వెళ్లలేకపోయాయి. డిస్కోరాజా .. సోలో బ్రతుకే సో బెటర్ .. అల్లుడు అదుర్స్ .. మాస్ట్రో వంటి సినిమాలు పరాజయాలను ముట్టజెప్పాయి. దాంతో కొత్త ప్రాజెక్టులలో ఎక్కడా కూడా ఆమె పేరు వినిపించడం లేదు .. కనిపించడం లేదు. వరుస సినిమాలతో ఆమె కెరియర్ అందుకున్నట్టే అందుకుని, అంతలోనే జోరు తగ్గడం విచారకరమే. మరేదైనా ఛాన్స్ తో ఆమెకి మంచి రోజులు వస్తాయేమో చూడాలి.