సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతంపై.. ఈ మధ్య గట్టి చర్యలే తీసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా పైరసీ సమస్య కొంత మేర నియంత్రణలోకి వచ్చింది. గతంలో మాదిరిగా మరీ రిలీజ్ రోజో.. ఆ తర్వాత రోజో నెట్లో పూర్తి సినిమా కనిపించే సందర్భాలు కనిపించడం లేదు. ఒకట్రెండు హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కి ముందే వచ్చినా.. చాలా సందర్భాల్లో నియంత్రించగలిగారు.
కానీ ధృవ విషయంలో తేడా వచ్చేసింది. డీమానిటైజేషన్ దెబ్బకి ధృవ వసూళ్లపై విపరీతమైన ప్రభావం పడ్డ సంగతి తెలిసిందే. రెండో రోజు నుంచి పుంజుకున్నా తొలి రోజు వసూళ్లు బాగా తగ్గాయి. ఇప్పుడు ధృవ పైరసీ ప్రింట్ ఒకటి ఆన్ లైక్ లీక్ కావడం సంచలనం అవుతోంది. రెండో రోజుకే పూర్తి సినిమా నెట్ లో కనిపించిందనే రిపోర్టులు ఉన్నాయి. అప్పటికప్పుడు చర్యలు తీసుకుని వాటిని తొలగించే చర్యలు చేపట్టినా.. ఇలాంటి వాటి కారణంగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూనే ఉంటుంది.
మరోవైపు.. ఆన్ లైన్ లీక్ అయినది ఏ మాత్రం క్వాలిటీ లేని థియేటర్ ప్రింట్ అని తెలుస్తోంది. ఇండస్ట్రీకి భారీ చిత్రాల విడుదల విషయంలో ధైర్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న ధృవకు.. ఇబ్బందులు పెరుగుతుండడం గమనించాల్సిన విషయం.