రాను రాను సినిమాల ట్రెండ్స్ ఎలా మలుపు తిరుగుతున్నాయో అంతు చిక్కడం లేదు. ఒకపక్క అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థలు కేవలం నెల రోజులకే కొత్త సినిమాలను అందుబాటులోకి తెస్తూ థియేటర్ల మనుగడకు సవాల్ విసురుతుండగా మరోపక్క పైరసీ భూతం సైతం కొత్త రూపాన్ని తీసుకుంటూ షాకులిచ్చే విధంగా మారుతోంది.
గత వారం జాన్ అబ్రహం నటించిన రోమియో అక్బర్ వాల్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. కథలో విషయం ఉన్నప్పటికీ టేకింగ్ మరీ తీసికట్టుగా ఉండటంతో క్రిటిక్స్ దీన్ని సింగల్ రేటింగ్ తో ఉతికి ఆరేశారు. కొత్త సినిమా అందులోనూ జాన్ అబ్రహం కాబట్టి ఏదోలా ఓ పది రోజులైనా రన్ ఆశించారు నిర్మాతలు.
కానీ వాళ్లకు షాక్ ఇస్తూ కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఆన్ లైన్ సెన్సార్ కోసం రెడీ చేసిన ఒక ప్రింట్ ఒరిజినల్ హెచ్ డి క్లారిటీతో ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యింది. థియేటర్లో తీసిన కెమెరా కాపీలు రావడం సహజం కానీ ఇలా హై రిజొల్యూషన్ తో రావడం మాత్రం అరుదు
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. దీన్ని ఆన్ లైన్ లో పెట్టేసిన లీకు వీరులు నిర్మాతలైన వయాకామ్ 16 సంస్థనే తమ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో ఇది పెట్టిందని కాబట్టి ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమి లేదని అందులో పేర్కొనడం గమనార్హం. ఒకప్పుడు విడుదలకు ముందు లీకులు అంటూ అత్తారింటికి దారేది టాక్సీ వాలా లాంటి సినిమాలు బాగా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు ఇలా వారం రోజుల లోపే ప్రింట్లు ఆన్ లైన్ లో ప్రత్యక్షమైతే ఇక థియేటర్ల మనుగడ ఎలా సాగించాలి అనే ప్రశ్న వస్తుంది. సినిమా దారుణంగా పరాజయం పాలైన నేపథ్యంలో వయాకామ్ నుంచి ఈ విషయంగా ఎలాంటి స్పందన లేదు