రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కష్టమే...!

Update: 2020-04-02 23:30 GMT
కరోనా మహమ్మారి మూలంగా అందరి తలరాతలు మారుతూ వస్తున్నాయి. డబ్బున్నోడు, పేదోడు, మధ్య తరగతి అని తేడా లేకుండా అందర్నీ అల్లాడిస్తున్నది. ఇంక ప్రపంచ వ్యాప్తంగా దీని వల్ల అన్ని రంగాలకు నష్టం వాటిల్లింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మన దేశంలో కూడా చాలా ప్రభావం చూపింది. ముఖ్యంగా పర్యాటక రంగం, సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. సినీ ఇండస్ట్రీ షూటింగులు అన్నీ ఆపుకొని, థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతవేసి లాక్ డౌన్ చేసుకుంది. దీంతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాను. షూటింగులు ఆగిపోవడంతో ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మన టాలీవుడ్ లో ఈ ఏడాది అల్లు అర్జున్, బాలయ్య, నిఖిల్, నాగచైతన్య లాంటి హీరోలు రెండు రెండు సినిమాలను రెడీ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వచ్చి మీద పడటంతో ఇప్పుడు అన్ని లెక్కలు మారి పోయాయి. ఒక్క సినిమా రిలీజ్ కి రెడీ చాలు అనుకుంటున్నారు.

ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాలు షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసినా రిలీజ్ డేట్ల విషయం లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ - బోయపాటి సినిమా, బన్నీ - సుకుమార్ సినిమా, నిఖిల్ కార్తికేయ2 - 18 పేజిస్ లాంటి సినిమాలు ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇవి  షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే టైమ్ కి ఆర్.ఆర్.ఆర్  లాంటి పాన్ ఇండియా మూవీస్ కూడా సిద్ధంగా ఉంటాయి. అప్పుడు వీటన్నిటికీ డేట్స్ క్లాషెస్ కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు తేదీలను ముందుకు జరుపుకుంటూ పోతే దసరా సీజన్లో రిలీజ్ కావాల్సిన ప్రభాస్ - రాధాకృష్ణ మూవీ, కేజీయఫ్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ డేట్స్ గురించి కూడా ఆలోచించాలి. ఇలాంటి నేపథ్యంలో స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ విషయం సినీ ఇండస్ట్రీ లో నిర్మాతలకు పెద్ద తల నొప్పినే తెచ్చి పెట్టేలా ఉన్నాయి. అయితే వీటన్నింటికి కారణం కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Tags:    

Similar News