సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి చిత్రాలు జరుగుతాయో.. ఎవరు ఓవర్ నైట్ స్టార్ గా మారతారో.. ఏ ప్రాజెక్ట్ ఎవరి చేతుల్లోకి వెళుతుందో.. బిజీగా వున్న డైరెక్టర్ ఉన్నట్టుండి సినిమాలు లేని స్థితికి చేరుకుంటాడో చెప్పడం కష్టం. అంతే కాకుండా అనుకున్న ప్రాజెక్ట్ లు ఏళ్లు గడుస్తున్నా ముందుకు వెళ్లి సందర్భాలు కూడా ఇక్కడ ఎక్కువే. ఇన్నిచిత్రాలు జరిగే ఇండస్ట్రీలో ఇప్పడు ఓ స్టార్ హీరో ముగ్గురు క్రేజీ డైరెక్టర్ల విషయంలో సైలెంట్ గా వుండటం.. సదరు దర్శకులు మాత్రం స్టార్ హీరోతో మా ప్రాజెక్ట్ వుంటుందని చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ లో వున్న స్టార్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు తనదైన డాన్స్ లతో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసకున్నారు. గత ఏడాది స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన `పుష్ప`తో ఏకంగా ప్రభాస్ తరువాత పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. గత ఏడాది విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ మూవీలో బన్నీ పలికిన డైలాగ్స్, మేనరిజమ్, శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్ వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యాయి.
దీంతో స్టార్ గా బన్నీ మరింత క్రేజ్ ని, ఫేమ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ముందు అల్లు అర్జున్ ముగ్గురు స్టార్ డైరెక్టర్లతో క్రేజీ ప్రాజెక్ట్ లు చేయాలనుకున్నాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో `ఐకాన్` ప్రాజెక్ట్ ని ప్రకటించారు. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ కు నిర్మాత. అధికారికంగా ప్రకటించి చాలా రోజులే అవుతున్నా ఈ ప్రాజెక్ట్ మాత్రం ముందుకు వెళ్లడం లేదు. దీన్ని పక్కన పెట్టి శ్రీరామ్ వేణు ..పవన్ తో `వకీల్ సాబ్` మూవీ చేశాడు.
ప్రస్తుతం మరో హీరోతో తన తదుపరి సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడు. దీంతో `ఐకాన్ ` ఇక లేనట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దర్శకుడు, మేకర్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ వుంటుందని చెబుతున్నారు. బన్నీ మాత్రం ఈ ప్రాజెక్ట్ పై సైలెంన్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఏడాదిన్నర క్రితం బన్నీతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తెరపైకి తీసుకురావాలని దర్శకుడు ఎన్. లింగుస్వామి ప్రయత్నాలు చేశాడు. అది కార్యరూపం దాల్చలేదు. అదే కథని ఇప్పడు రామ్ తో `ది వారియర్` గా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు బన్నీతో ప్రాజెక్ట్ వుంటుందని స్పష్టం చేశాడు.
ఈ ప్రాజెక్ట్ విషయంలోనూ బన్నీ సైలెంట్ గానే వుంటున్నారు కానీ లింగుస్వామి ప్రాజెక్ట్ వుంటుందని, ఉండదని కానీ చెప్పడం లేదు. ఇక స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో మాసీవ్ ప్రాజెక్ట్ ని బన్నీ ప్రకటించడం, ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడం తెలిసిందే. స్టూడెంట్ లీడర్ దేశ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పాడనే కథతో ఈ మూవీని తెరపైకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ముందు వెళ్లేలా కనిపించడం లేదు. ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్న ప్రొడ్యూసర్ సుధాకర్ మిక్కిలినేని ప్రస్తుతం ఎన్టీఆర్ 30 వ సినిమాని నిర్మించబోతున్నారు.
అయితే బన్నీ ప్రాజెక్ట్ వుంటుందా? అని ఇటీవల `ఆచార్య` ప్రమోషన్స్ లో కొరటాల ని ప్రశ్నిస్తే వుంటుందని చెప్పడం విశేషం. ఇలా బన్నీతో సినిమాలు చేయాల్సిన ముగ్గురు దర్శకులు వేచి చూస్తామంటూ ఒకే సమాధానం చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ ముగ్గురి దర్శకులు ప్రాజెక్ట్ ల గురించి బన్నీ మాత్రం నోరు విప్పకుండా సైలెంట్ ని మెయింటైన్ చేస్తుండటం గమనార్హం. దీంతో బన్నీ ఈ ముగ్గురు డైరెక్టర్లతో సైలెంట్ గేమ్ ఆడుతున్నాడని కామెంట్ లు వినిపిస్తున్నాయి.