సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ 'పోకిరి'. పూరి జగన్నాథ్ - మహేష్ ల తొలి కలయికలో తెరకెక్కిన ఈ మూవీ 2006లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డులు తిరగరాసింది. హీరో సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోనే తిరుగులేని మూవీగా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ మూవీని మహేష్ పుట్టిన రోజు సందర్భంగా 4కె ఫార్మాట్ లోకి మార్చి ఆగస్టు 9న భారీ స్థాయిలో విడుదల చేశారు. ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయి బుకింగ్స్ తో ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టించింది.
అంతే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఈ మూవీని ప్రత్యేకంగా విడుదల చేశారు. మహేష్ బర్త్ డే సందర్బంగా విడుదలైన ఈ మూవీ అత్యంత భారీ స్థాయిలో రీ రిలీజ్ అయిన సినిమాగా సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. 'పోకిరి' 4కె ప్రింట్ రిలీజ్, మహేష్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ గత పది పదిహేను రోజుల ముందు నుంచే సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేశారు. నెట్టింట మహేస్ బర్త్ డే హంగామాతో పాటు 'పోకిరి' 4కె లో రీ రిలీజ్ అవుతున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇదిలా వుంటే 'పోకిరి' ప్రదర్శించిన థియేటర్లలో ఫ్యాన్స్ చేసిన ఓవరాక్షన్ కారణంగా ఏపీ లోని పలు థియేటర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఫ్యాన్స్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన కొన్ని థియేటర్లలోకి స్క్రీన్స్ ని చించేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన వారంతా మహేష్ ఫ్యాన్స్ పై కామెంట్ లు చేస్తున్నారు. అభిమానం హద్దులు దాటడం ఏమీ బాగాలేదని మండిపడుతున్నారు.
అభిమాన హీరో పుట్టిన రోజున స్పెషల్ షోని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని ఏర్పాటు చేస్తే ఇలా స్క్రీన్స్ ని చించేయడం ఏమీ బాగాలేదని కామెంట్ లు చేస్తున్నారు. ప్రతీ స్క్రీర్ కాస్ట్ రూ. 15 లక్షల వరకు వుంటుందని, స్క్రీన్స్ చించడం ఆస్తినష్టం కిందికి వస్తుంది కాబట్టి దీనిపై సదరు థియేటర్స్ యాజమాన్యాలు కేసులు పెట్టే అవకాశం వుందని తెలుస్తోంది. త్వరలో పవన్ పుట్టిన రోజు రాబోతోంది. ఈ సందర్భంగా 'జల్సా'ని 4కె లో రీ రిలీజ్ చేయాలని, ప్రత్యేక షోలు ఏర్పాటు చేయాలని ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ వర్గాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ తరువాత ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 'వర్షం' మూవీని 4కెలో విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఈ రెండు సినిమాల రి రిలీజ్ ల సమయంలో వీరి ఫ్యాన్స్ కూడా మహేష్ ఫ్యాన్స్ తరహాలోనే థియేటర్ల స్క్రీన్స్ ని డామేజ్ చేస్తారా? లేక గుడ్ బాయ్స్ లాగే కుదురుగా వుంటారో వేచి చూడాల్సిందే.