పూన‌మ్ వివాదం.. వాయిస్ దొంగ దొరికాడు!

Update: 2019-06-12 05:06 GMT
న‌టుడు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ కల్యాణ్ గురించి ఇండైరెక్ట్‌ గా చెప్పిన విష‌యాలకు సంబంధించిన వాయిస్ టేపు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల స‌మ‌యంలో పూన‌మ్ వాయిస్ టేపులు బ‌య‌టికి రావ‌డంతో దాని ప్ర‌భావం ప‌వ‌న్ పార్టీపై ప‌డుతుంద‌ని అంతా భావించారు. పూన‌మ్ వాయిస్ టేపుల బ‌య‌టికి రావ‌డానికి ల‌క్ష్మీపార్వ‌తి ఇంట్లో ప‌నిచేసిన కోటి అనే జూనియ‌ర్ ఆర్టిస్ట్ అని తేల‌డంతో విష‌యం ఓ కొలిక్కి వ‌స్తుంద‌ని అంతా భావించారు. అయితే ఆ త‌రువాత కూడా ల‌క్ష్మీ పార్వ‌తి  లైంగికంగా త‌న‌ని వేధింపుల‌కు గురి చేస్తోందంటూ అస‌భ్య ప‌ద‌జాలంతో ఆమెపై కోటి సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఈ ఉదంతం పెను వివాదంగా మారింది.

ల‌క్ష్మీ పార్వ‌తి,  న‌టి పూన‌మ్ కౌర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు కోటి కోసం గాలించ‌డం మొద‌లుపెట్టారు.  ఈ విష‌యం తెలుసుకున్న కోటి త‌ప్పించుకు తిరుగుతూ చివ‌రికి మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ నాంప‌ల్లి కోర్టులో లొంగిపోయాడు. దీంతో ల‌క్ష్మీపార్వ‌తి- పూన‌మ్ కౌర్ ఊపిరి పీల్చుకున్నారు. న‌మ్మించి కోటి మోసం చేశాడ‌ని త‌న‌పై సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేశాడ‌ని ల‌క్ష్మీ పార్వ‌త ఏప్రిల్ 15న పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియాలో ఈ ఉదంతం వైర‌ల్ కావ‌డంతో ఈ కేసును పోలీసుల సీరియ‌స్‌ గా తీసుకున్నారు.

ల‌క్ష్మీపార్వ‌తి మొబైల్ నుంచి మెసేజ్‌ లు పెట్ట‌డంతో పాటు  పూన‌మ్ కౌర్ వాయిస్ ని కూడా సోష‌ల్ మీడియాకు లీక్ చేసింది కోటినే అని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన పోలీసులు అత‌న్ని క‌ఠినంగా శిక్షించాల‌ని భావించారు. అయితే ఇంత కాలంగా త‌ప్పించుకు తిరుగుతున్న కోటి  మంగ‌ళ‌వారం నాంప‌ల్లి కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసుతో పాటు కోటికి కేఏ పాల్ సోద‌రుడు డేవిడ్ రాజు హ‌త్య కేసుతోనూ సంబంధాలు వున్న‌ట్లు పోలీసులు గుర్తించ‌డంతో కేసు కొత్త మ‌లుపు తిరిగ‌డం సంచ‌ల‌మైంది.

    

Tags:    

Similar News