హీరోయిన్ మీరా చోప్రాపై కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన విమర్శలు తీవ్ర దుమారంను రాజేసిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ తెలియదు అన్నందుకు చాలా హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ట్విట్టర్ వేదికగా ఆమెను తూలనాడారు. ఆమెపై బూతులు కురిపిస్తూ వేదించారు. ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ఏకంగా 30 వేల ట్వీట్స్ చేశారు. చంపేస్తామని కూడా బెదిరించడంతో సైబర్ క్రైమ్ పోలీసులను మీరా చోప్రా ఆశ్రయించడం కేటీఆర్ కూడా ఆమె కేసు విషయంలో స్పందించడంతో అది కాస్త సీరియస్ అయ్యింది.
ఈ కేసులో మొత్తం 15 మందిని పోలీసులు కీలకంగా గుర్తించారు. వారు శృతిమించి మీరా చోప్రాపై ట్రోల్స్ చేశారు. బూతులు తిడుతూ చంపేస్తామని బెదిరించారు. అందుకే వారిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయాలని భావించారు. అయితే అప్పటికే వారు తమ ట్విట్టర్ అకౌంట్స్ ను డిలీట్ చేయడం జరిగింది. దాంతో పోలీసులు ఇప్పుడు ట్విట్టర్ సంస్థను ఆశ్రయించింది.
ఆ డిలీట్ అయిన అకౌంట్స్ డేటాను ఇవ్వాల్సిందిగా ట్విట్టర్ సంస్థకు పోలీసులు లేఖ రాయడం జరిగింది. సంస్థ వద్ద బ్యాకప్ ఉండి ఉంటే పోలీసులు వారిని పట్టుకోవడంలో ఉపయోగపడుతుంది. పది మంది తమ ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేయగా మరో అయిదుగురు మాత్రం అలాగే ఉన్నారు. వారిని పోలీసులు ప్రశ్నించేందుకు సిద్దం అవుతున్నారు.