దక్షిణాది సినీరంగంలో వైవిధ్య భరితమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు - గాయకుడు - సంగీత దర్శకుడు - మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ మణి మరణంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఊపిరితిత్తులు - కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కోచిలోని అమృత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మృతిపై కొచ్చి నగర పోలీసుల ఆధ్వర్యంలో అనుమానాస్పద కేసు నమోదైంది.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం పెద్దమొత్తంలో ఆల్కాహాల్ సేవించడం వల్ల మణి అనారోగ్యం పాలైనట్లు తేల్చారు. వాంతులు అవడం వల్ల కళాభవన్ మణి ఆస్పత్రి పాలయ్యారని చికిత్స చేస్తుండగా మరణించారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కొచ్చి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం మరోమారు శవపరీక్ష నిర్వహించనున్నట్లు పోలీస్ ఉన్నతవవర్గాలు వివరించాయి.
మణి1971 జనవరి 1న జన్మించారు. ఆయనకు భార్య - కూతురు ఉన్నారు. రిక్షా డ్రైవర్ గా పనిచేస్తూనే.. కేరళలో గొప్ప కళాకారులను అందించిన కళాభవన్‌లో మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆ కళాభవన్ పేరునే ఇంటిపేరుగా చేసుకున్నారు. హాస్య నటుడిగా అక్షరం సినిమాతో మలయాళ సినీరంగానికి పరిచయమైన మణి.. వాసంతియుం లక్ష్మీయం పిన్నె న్యానమ్ చిత్రంలో అంధ వీధి గాయకుడిగా అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఆ చిత్రంలో ఆయన నటనకు జాతీయస్థాయిలో ప్రత్యేక ప్రశంస అవార్డుతోపాటు, పలు అవార్డులను అందుకున్నారు. 25కుపైగా చిత్రాల్లో పాటలు పాడారు. మలయాళం - తమిళం - తెలుగులో 200 చిత్రాలకుపైగా నటించారు.