ఎన్టీఆర్ కుమారుడు ప్రయాణిస్తున్న కారును ఆపేసిన పోలీసులు

Update: 2022-03-21 09:35 GMT
స్టార్ సెలబ్రెటీలు, ముఖ్యంగా సినిమా తారలు.. బ్లాక్ గ్లాస్ లు ఉండే ఖరీదైన కార్లలో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఇది హైదరాబాద్లోని చాలా మంది ప్రముఖులు చేస్తున్నది ఇదే. వారు బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రజల దృష్టి తమ మీద పడకుండా కార్ల అద్దాలకు బ్లాక్ గ్లాస్ ను పెట్టుకుంటారు.

అయితే దీన్ని సుప్రీంకోర్టు గతంలో నిషేధించింది. కార్ల కిటీకీ అద్దాలపై బ్లాక్ రేడియంలను అతికించరాదని తీర్పునిచ్చింది. వీటివల్ల లోపల ఎలాంటి ఘోరాలు, మోసాలు జరుగుతున్నాయో తెలియడం లేదని పేర్కొంది.

ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ లో సెలబ్రెటీల కార్లు ప్రమాదాలకు కారణం అవ్వడం.. పైన ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లతో ప్రయాణిస్తున్న దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. బ్లాక్ స్టిక్కర్లు అంటించిన కార్లను గుర్తించి వాటిని తొలగించే పనిని ప్రారంభించారు.

ఆసక్తికరంగా నిన్న ఆదివారం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారును హైదరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కారు అద్దాలకు ఉన్న నల్లటి స్టిక్కర్లను తొలగించారు.

నిన్న తెల్లవారుజామున జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద పోలీసులు కారును ఆపినప్పుడు వాహనంలో ఎన్టీఆర్ కుమారుడు.. మరికొందరితో కలిసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఎన్టీఆర్ కారు అద్దాలకు ఉన్న నల్లటి స్టిక్కర్లు తొలగించి వాహనాన్ని విడిచిపెట్టారు.

హైదరాబాద్ పోలీసులు చేపట్టిన కొత్త డ్రైవ్ లో భారీగా నల్లటి స్టిక్కర్లు అంటించిన సెలబ్రెటీల వాహనాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఆ స్టిక్కర్ల తొలగింపుతో సెలబ్రెటీలు లోపల ఉన్న విషయం తెలిసి వారికి కొత్త కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News