హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్ వ్యవహారం కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో.. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిన అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా 10 మందిని అరెస్టు చేసింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న రియాను విచారించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఇచ్చిన సమాచారంతో ముంబై - గోవా ప్రాంతాల్లో పలు చోట్ల రెయిడ్స్ చేసి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరో మరో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్ ని అదుపులోకి తీసుకుందని తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు డ్రగ్స్ కేసులో అరెస్టయినవారి సంఖ్య 16కు చేరింది.
కాగా, ముంబైకి చెందిన డ్వేన్ ఫెర్నాండెజ్ - కరమ్ జీత్ సింగ్ ఆనంద్ - సంకేత్ పటేల్ - అంకుష్ అన్రేజా - సందీప్ గుప్తా - అఫ్తాబ్ ఫతే అన్సారీ అనే వారిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆరుగురు డ్రగ్స్ సరఫరాలో భాగం పంచుకున్నట్లు తెలిపారు. డ్రగ్ డీలర్ ఫెర్నాండెజ్ రియా సోదరుడు షోవిక్ కు సహాయకుడిగా వ్యవహరించేవాడని అధికారులు గుర్తించారు. ఇక కరోనా లాక్ డౌన్ సమయంలో సుశాంత్ సింగ్ కొన్ని రోజులు రియా చక్రవర్తితో కలిసి ఆమె ఇంట్లోనే ఉండాలని భావించి.. అందుకోసం 500 గ్రాముల మాదక ద్రవ్యాలను ప్యాక్ చేసి కొరియర్ లో ఆమె ఇంటికి పంపించాలనుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రియా ఇచ్చే సమాచారంతో మరిన్ని డ్రగ్స్ రాకెట్ వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.