శ్యామ్ కె.నాయుడు కేసులో ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్ రాజీకి ప్రయత్నించారా...?
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని సినీ నటి శ్రీ సుధ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్యామ్ కె.నాయుడు ఐదేళ్లుగా తనతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీ సుధ. దీంతో పోలీసులు శ్యామ్ కె.నాయుడు పై కేసు నమోదు చేసారు. ప్రస్తుతం ఈ కేసు కోర్ట్ విచారణలో ఉంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో శ్రీసుధ - శ్యామ్ కె నాయుడు మధ్య ఉన్న వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు శ్యామ్ కుటుంబ సభ్యులు చర్చలు జరిపారట. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇద్దరు ప్రముఖ నిర్మాతలు శ్యామ్ కు సహాయం చేయడానికి.. వ్వవహారం రాజీ చేయడానికి ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సెటిల్మెంట్ వ్యవహారం అంతా సజావుగానే నడించిందని.. వీరి ప్రతిపాదనకు శ్రీ సుధ కూడా సానుకూలంగా స్పందించిందట. అయితే ఇదంతా జరిగేలోపు పోలీసులు కేసు అంతా విచారించడం అయిపోయిందని.. కోర్టుకు సబ్ మిట్ చేసేస్తున్నామని.. ఈ దశలో సెటిల్మెంట్ కుదరదని చెప్పారట. దాంతో కేసు కోర్టుకు వెళ్లిపోయిందట. ఇక చేసేదేమీ లేదని అంతా కోర్ట్ లోనే తేల్చుకోవాలని పోలీసులు చెప్పినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఇటీవల శ్రీ సుధ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్యామ్ కె నాయుడుకి నాకు ఐదేళ్ల నుండి పరిచయం ఉంది. మేము రిలేషన్ లో ఉన్న తరువాత వాళ్ల ఇంటి నుంచి నాకు బెదిరింపు కాల్స్ వచ్చేవి. చోటా కె నాయుడు కూడా ఈ విషయంలో ఎంత వరకూ మాట్లాడాలో అంతే మాట్లాడారు. మొదట్లో బాగానే మాట్లాడారు. అయితే ఈ విషయంలో పెద్ద పెద్ద గొడవలు కావడంతో నాకు సంబంధం లేదన్నారు. ఈ విషయంలో సందీప్ కిషన్ తల్లిగారు నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. చోటా కె నాయుడు గారు ఏదైతే చెప్పారో ఈవిడ కూడా అదే అన్నారు. పెద్దవాళ్లు వచ్చినప్పుడు కన్వెన్స్ కావాలి కదా అని విన్నా.. శ్యామ్ కె నాయుడు ఎలాగూ ఏం చెప్పడం లేదు.. ఆవిడ వచ్చి మాట్లాడితే కన్వెన్స్ అయ్యా.. వాళ్లు చెప్పినట్టు విన్నా కాని న్యాయం జరగలేదు. అందుకే కేసు పెట్టాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది శ్రీ సుధ రెడ్డి.