రోజులు ఒకప్పట్లా లేవు. ఈ రోజుల్లో చిన్న మాట కూడా పెద్ద వివాదం అయిపోతుంది. సినిమాను సినిమాలా చూసే రోజులు పోయాయి. చిన్న చిన్న విషయాలకే కాంట్రవర్సీలు రాజేస్తున్నారు జనాలు. అలాంటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ మాట రాసేటపుడు, ఓ సీన్ తీసేటపుడు చాలా అప్రమత్తత పాటించాలి. కామెడీ కోసం కొంచెం గీత దాటితే.. అంతే సంగతులు. జనాల మనోభావాలు దెబ్బతినేస్తాయ్. ఫ్రీడమ్ తీసుకుంటే గొడవలైపోతాయి. కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘షేర్’ ట్రైలర్లో ఓ డైలాగ్ జనాల మనోభావాల్ని దెబ్బతీసేట్లే ఉందంటున్నారు పొలిటికల్ జనాలు.
కమెడియన్ పృథ్వీ.. ట్రైలర్ చివర్లో డైలాగ్ చెబుతాడు.. ‘‘పోలవరం ప్రాజెక్టు.. వీడి పెళ్లి జరిగినట్లే ఉంటాయి. కానీ జరగవు, చిరాగ్గా’’ అంటాడు. ఈ డైలాగే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు పోలవరం. ఈ ప్రాజెక్టు విషయంలో ఎన్ని గొడవలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతోంది. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ లో కలపడం ఎంత పెద్ద వివాదమైందో తెలిసిందే. ఇప్పుడు ‘షేర్’ డైలాగ్ చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు డిలే కావడంపై సెటైర్ వేసినట్లుగా ఉంది. దీంతో ఈ డైలాగ్ మీద కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ కు ముందే గొడవ మొదలైన నేపథ్యంలో ఈ డైలాగ్ సెన్సార్లో లేచిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.