ఇప్పుడు అందరిదీ ఇదే పాట. అసలు యాక్టర్ల కొడుకులు మాత్రమే యాక్టర్లు కావాలా? అందుకే డైరక్టర్ల నుండి డాక్టర్ల వరకు.. రియల్ ఎస్టేట్ రాజాల నుండి పొలిటికల్ నాయకుల వరకు.. ఇలా అందరూ తమ కొడుకులను హీరోలుగానే ప్రమోట్ చేస్తున్నారు. వారిలో అందరూ క్లిక్ అవ్వకపోవచ్చు. ఎప్పుడో ఓ 10-12 ఏళ్ల తరువాత దివంగత మహరాష్ట్ర సిఎం విలాస్ రావ్ దేశ్ ముక్ తనయుడు రితేష్ దేశ్ ముక్ టైపులో సక్సెస్ అవ్వొచ్చు. కాని వెండితర ద్వారా పాపులర్ అయితే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు పొలిటికల్ లీడర్లు.
మాజీ ప్రధాన మంత్రి హెచ్.డి.దేవేగౌడ మనవడు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి కొడుకు అయిన నిఖిల్ గౌడ.. హీరోగా కన్నడ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నాడు. పూరి జగన్ ఇతగాడిని లాంచ్ చేయనున్నాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇకపోతే మన రాష్ట్రంలో కూడా మంత్రి ఘంటా శ్రీనివాసరావు కుమారుడు కూడా రవితేజ కూడా హీరోగా అవ్వాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. అప్పట్లో తనికెళ్ళ భరణి డైరక్షన్ లో ఒక సినిమా అనుకున్నాక ఆగిపోయిందిలే. ఇప్పుడు ఓ ప్రముఖ స్టార్ డైరక్టర్ తో లాంచింగ్ చేయించే పనిలో ఉన్నారట. ఇకపోతే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సిఎం తమ్ముడి కొడుకు నారా రోహిత్ హీరోగా కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. చూస్తుంటే రాజకీయా నేతలందరు ముందుగా తమ వారసులకు వెండితెర ద్వారా ఇమేజ్ ను పెంచి ఆ తరువాత వారిని పొలిటికల్ తెరకు పరిచయం చేస్తారేమో అనిపిస్తోంది.
నిజానికి కొంతమంది నాయకులు పిల్లలు 18 ఏళ్లు నిండగానే రాజకీయాల్లో వచ్చేస్తున్నా కూడా.. కాస్త తెలివిగా ఆలోచించే పిల్లలు మాత్రం.. హీరోలుగా సెటిలయ్యాకే రాజకీయాల్లోకి వస్తాం అంటున్నారట. బహుశా హీరోగా సక్సెస్ ఫెయిల్యూర్ ను చవిచూస్తే.. పొలిటికల్ విమర్శలను తట్టుకోవడం కాస్త వీజీ అయిపోతుందని వీరి ఫీలింగేమో!!!