రంగస్థలాన ఏమడిగినా కాదనలేని రాణి

Update: 2018-03-15 04:22 GMT
ధృవ తర్వాత రాంచరణ్ మూవీ ఏమొస్తుందా అని ఏడాదికి పైగా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. మరో రెండు వారాల్లో వారి వెయిటింగ్ కు తెరవేస్తూ.. రంగస్థలం మూవీ థియేటర్లలోకి వచ్చేయనుంది. లెంగ్తీ మూవీ అనే ఇండికేషన్స్ ఉన్న ఈ సినిమాలో ఐదు పాటలు ఉంటాయని చెప్పేశారు మేకర్స్. మొదటగా ఒక్కో పాటను విడుదల చేసిన రంగస్థలం టీమ్.. ఇప్పుడు ఆడియో మొత్తాన్ని ఇచ్చేశారు.

రంగస్థలం ఆల్బంలో చివరగా వినిపించే పాట జిగేలురాణి. ఇది ఐటెం సాంగ్ అనే సంగతి పాట ప్రారంభంలోనే అర్ధమవుతుంది. ఐటెం సాంగ్స్ అందించడంలో తన ప్రత్యేకతను చాటే దేవిశ్రీ ప్రసాద్.. మరోసారి ఇరగదీసే రేంజ్ లో జిగేలు రాణి పాటను కంపోజ్ చేశాడు. ప్రతీ లైన్ క్యాచీగా ఉండగా.. ప్రతీ బీట్ అదిరిపోయింది. జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాణి అంటూ పూజా హెగ్డే చూపించే అందాలు.. రాంచరణ్ స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐటెం సాంగుకు చాలా పవర్ ఉంటుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో ఇవి చేసే మ్యాజిక్కే వేరుగా ఉంటుంది. ఇక పల్లెటూరి వాసనలతో.. 30 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా.. తెలియని వాళ్లకు తెలియచేసేలా ఉన్న జిగేలు రాణి పాట.. ఈ జనరేషన్ సాంగ్స్ లో స్పెషల్ గా నిలిచిపోనుంది. అసలు ఈ పాటకు ప్రతీ ఒక్కరూ డ్యాన్సులు చేయడం ఖాయం అంటూ పూజా హెగ్డే ఇప్పటికే తెగ ఊరించింది. మరి చెర్రీ స్టెప్పులను కూడా చూసిన తర్వాత.. మెగా ఫ్యాన్స్ అస్సలు ఆగలేరేమో!
Tags:    

Similar News