డార్లింగ్ సినిమాకోసం ఆసక్తిగా ఉందట

Update: 2019-11-09 10:19 GMT
డార్లింగ్ ప్రభాస్ 'సాహో' తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జాన్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.  ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 18 తారీఖు నుంచి ప్రారంభం అవుతుందని సమాచారం.

కథ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్.. పూజాలు హెగ్డేలు రెట్రో స్టైల్ లో కనిపించబోతున్నారు. ఈ ఎపిసోడ్ అంతా యూరోప్ నేపథ్యంలో సాగుతుందట.  ఈ ఎపిసోడ్ కు సంబంధించిన కొంత భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. రీసెంట్ గా పూజ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ముంబైలో కొంతకాలం క్రితం ప్రభాస్ ను కలిసినప్పుడు 'జాన్' గురించి చర్చించుకున్నామని తెలిపింది. ఆ సమయంలో ప్రభాస్ 'సాహో' ప్రమోషన్స్ తో బిజీగా ఉంటే పూజ 'హౌస్ ఫుల్ 4' షూటింగ్ కు హాజరవుతోందట.   జాన్ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పూజ చెప్పుకొచ్చింది.  

పూజ ఇప్పటి వరకూ రెండు హిందీ సినిమాలలో నటిస్తే ఆ రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  అయితే ఇప్పుడు 'జాన్' తో మరోసారి హిందీ ప్రేక్షకులను పలకరించే అవకాశం వచ్చింది.  ప్రభాస్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ సినిమా హిట్ అయితే పూజకు బాలీవుడ్ ఆశలు సజీవంగా ఉన్నట్టే.
Tags:    

Similar News