టాలీవుడ్ లో డిమాండ్ పరంగా పీక్స్ లో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే నిన్న ధోని పట్ల తన అభిమానాన్ని ప్రదర్శించుకోవడం పాపం ట్రాలింగ్ కు దారి తీసింది. కేవలం 18 పరుగుల తేడాతో ఇండియా సెమి ఫైనల్ లో ఓడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి 100 పరుగుల లోపే ఆరు కీలక వికెట్లు పడ్డప్పటికీ ధోని సహకారంతో రవీంద్ర జడేజా లక్ష్యానికి చెరువుగా తీసుకొచ్చాడు.
ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తొందరపడ్డ చరిత్రలో మచ్చలా మిగిలిపోయే దారుణ పరాజయం దక్కేది. ఒకరకంగా ఈ ఇద్దరు పరువు నిలబెట్టారు. ధోని చాలా స్లోగా ఆడినా వికెట్ పారేసుకుంటే జరిగే పరిణామం తెలుసు కాబట్టి డిఫెన్స్ ఆడక తప్పలేదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పూజా హెగ్డే ఒక ట్వీట్ పెట్టింది
భారత్ ఓడిపోవడం తన హృదయాన్ని గాయపరిచిందని కానీ ధోని ఎప్పటిలాగా జట్టును విజయ తీరాలకు చేర్చడం కోసం చాలా కష్టపడ్డాడని అందుకే అతన్ని అంతగా అభిమానిస్తానని పొగడ్తలతో ముంచెత్తింది.. అయితే ఇండియా ఓటమికి ధోనినే కారణం అని భావించిన కొందరు అభిమానులు పూజా హెగ్డే ట్వీట్ ని ఇంకోలా అర్థం చేసుకున్నారు.
గెలిచే మ్యాచును ఓడించిన ధోనిని మెచ్చుకుంటావా అంటూ ట్రాలింగ్ మొదలుపెట్టారు. వీటికి పూజా సమాధానం ఇవ్వలేదు కానీ నిజానికి ఇందులో ఎవరిని తప్పు బట్టాల్సిన పని లేదు. పూజా ఓటమికి బాధ పడుతూనే ధోనిని వెనకేసుకొచ్చింది అంతే. ఒకవేళ ధోని కనక అదే వరసలో వంద లోపు తన వికెట్ కూడా ఇచ్చేసుకుంటే ఏం జరిగేదో సదరు ట్రాలర్స్ ఊహించగలరా