`రాధేశ్యామ్` ప్ర‌మోష‌న్ లో పూజాహెగ్డే హైలైట్స్ ఇవే!

Update: 2022-03-04 10:55 GMT
ముంబై బ్యూటీ పూజాహెగ్డే `రాధేశ్యామ్` ప్ర‌మోష‌న్స్  లో స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతోన్న‌సంగ‌తి తెలిసిందే. సిస‌లైన‌ ముంబై మోడ‌ల్ ని ఆవిష్క‌రిస్తుంది. ప్ర‌చారంలో భాగంగా డిజైనర్  దుస్తుల్లో త‌ళుక్కున మెరుస్తుంది. ముంబై ఈవెంట్ లో వైట్ అండ్ వైట్ లో మెరిసింది. అటుపై మ‌రో ఈవెంట్ లో రెడ్ హాట్ లో మంట‌లు రేపింది. టాప్ టూ బాట‌మ్ ఒకే ఎరుపు వ‌ర్ణంలో ప్ర‌కాశవంతంగా మెరిసిపోయింది. వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఇచ్చిన ఫోజులు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

చెవుల‌కి బ‌ల‌మైన‌ దిద్దులు.. చేతి వేళ్ల‌ని సైతం క‌ప్పేసే డిజ‌న‌ర్ దుస్తుల్లో పూజా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. మ‌రి ఈ బ్యూటీ ఇంత‌గా హైలైట్ అవ్వ‌డానికి కార‌ణం త‌న‌లో డ్రెస్సింగ్ సెన్స్ అని క‌చ్చితంగా  చెప్పొచ్చు. పూజా వ‌చ్చిందంటే కెమెరా కళ్ల‌న్నీ ఆమెవైపునే ఉంటున్నాయి.

సాధార‌ణ దుస్తుల్లో వ‌స్తే లైట్ తీసుకుంటారని ముందే గ్ర‌హించిన బ్యూటీ అటెన్ష‌న్ మొత్తం త‌న‌వైపే ఉండేలా ఇలా డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపింస్తుంద‌న్న‌ది ఫిలి స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కొస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమా  ప్ర‌మోష‌న్ మించి డామినేట్చేస్తుంద‌ని గుస‌గుసా వినిపిస్తోంది.

మ‌రి ఇలా హైలైట్ అవ్వ‌డానికి మ‌రో బ‌మ‌లైన కార‌ణం కూడా ఉంది. `రాధేశ్యామ్` పాన్ ఇండియా సినిమా. ద‌క్షిణాది బాష‌ల‌తో పాటు బాలీవుడ్ లోనూ  పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. హిందీ మార్కెట్ ఈ సినిమాకి అత్యంత కీల‌కం. అందుకే యూనిట్ రెండ‌వ ట్రైల‌ర్ ని ప్ర‌త్యేకంగా ముంబై వెళ్లి మ‌రీ ఆవిష్క‌రించారు.

ముంబై మీడియాకి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. మ‌రి ఇక్క‌డ పూజా హెగ్డే అటెన్ష‌న్ దేనికి హైలైట్ అంటే?  సినిమా స‌క్సెస్ అయితే బ్యూటీ బాలీవుడ్ స‌హా పాన్ ఇండియాలో ఫేమ‌స్ అవుతుంది. ఇదే అమ్మ‌డి తొలి పాన్ ఇండియా చిత్రం కూడా.

బాలీవుడ్ చిత్రాలు స‌హా పాన్ ఇండియా సినిమాలు చేయాల‌న్న‌ది అమ్మ‌డి డ్రీమ్ గా క‌నిపిస్తుంది. తొలుత `ముకుంద‌`కి ముందు హృతిక్ రోష‌న్  స‌ర‌స‌న `మొహంజ‌దారో`లో న‌టించింది. భారీ అంచనాల మ‌ధ్య  రిలీజ్ అయిన ఆ చారిత్ర‌క నేప‌థ్యమున్న సినిమా వాటిని  అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.

దీంతో అక్క‌డ అవ‌కాశాలు రాని స‌మ‌యంలో తెలుగు ప‌రిశ్ర‌మ అక్కున చేర్చుకుని ..అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించి పెద్ద హీరోయిన్ ని చేసింది. న‌టిగా కెరీర్ బిల్డ్ అవుతోన్న స‌మ‌యంలో ప్ర‌భాస్ అండ్ కో  పాన్ ఇండియా చిత్రంలో అవ‌కాశం క‌ల్పించారు.  కానీ  ముంబై ఈవెంట్ లో  ఇద్ద‌రు ఎడ ముఖం..పెడ ముఖంగా క‌నిపించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News