ప్రస్తుతం తెలుగు తెరపై అందాల భామ పూజ హెగ్డే హవా నడుస్తోంది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న పూజ ఇటీవలే తన స్పీడ్ పెంచేసింది. 'అరవింద సమేత', మహర్షిల భారీ విజయాల తర్వాత తన హిట్ల పరంపర కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అమ్మడి హవా ప్రస్తుతం ఊపు మీద ఉన్నట్లే అన్పిస్తుంది. ఎందుకంటే వరుస ప్రాజెక్ట్ లతో పూజ ఫుల్ బిజీ. ప్రస్తుతం అమ్మడి చేతిలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. అంతేగాక అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇంకా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న అమ్మడి కెరీర్ నక్క తోక తొక్కినట్లుగా మారింది. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. టాలీవుడ్ దర్శక నిర్మాతలే కాదు పూజ మీద కోలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను పడిందట. తాజాగా అమ్మడు స్టార్ యాక్టర్ సూర్య సరసన అవకాశం కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ హరి చాలాకాలం టైం తీసుకొని సూర్య హీరోగా 'అరువ' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సూర్య-హరి ల కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు. అభిమానులలో సందడే ఎందుకంటే వాళ్లిద్దరూ కలిసి చాలా రికార్డులు బద్దలు కొట్టారు. సింగం సిరీస్ గురించి అందరికి తెలిసిందే. మరి పూజ నుండి ఎలాంటి వార్త వినిపించనుందో.. ఎదురుచూడాల్సిందే!