దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో తనలోని గ్లామర్ ధగధగలను టాలీవుడ్ కు చూపించింది కన్నడ బ్యూటీ పూజా హెగ్డే. ఆ సినిమాలో బికినీలో ఆమె సోకులు చూశాక ఫిదా అయిపోవడమే కాదు.. ఇంకో గ్లామర్ హీరోయిన్ దొరికిందని టాలీవుడ్ ఫిక్సయిపోయింది. ఈ గ్లామర్ షోయే ఇప్పుడు ఆమెకు ముగ్గురు స్టార్ హీరోల పక్కన అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం పూజా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సాక్ష్యం సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు రామ్ చరణ్ మూవీ రంగస్థలంలో ఐటం సాంగ్ చేస్తోంది. ఇవి కాక త్రివిక్రమ్ - ఎన్టీఆర్.. వంశీ పైడిపల్లి - మహేష్ బాబు కాంబినేషన్లలో వచ్చే మూవీలోనూ పూజకు ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది. ఇది కాకుండా సాహో తరవాత రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ నటించే చిత్రంలోనూ హీరోయిన్ గా ఆమెనే తీసుకునే ఆలోచనలో ఆ చిత్ర యూనిట్ ఉంది. బికినీ సీన్లతో టాలీవుడ్ లో పెద్ద హీరోల పక్కన అవకాశాలు దక్కించుకున్నా పూజా మనసంతా బాలీవుడ్ పైనే ఉంది.
హిందీలో తొలిసారిగా హృతిక్ రోషన్ పక్కన నటించిన మొహెంజొదారో దారునమైన ఫ్లాప్ కావడంతో పూజా మళ్లీ వెనక్కి టాలీవుడ్ కు వచ్చింది. ఎలాగైనా మళ్లీ బాలీవుడ్ లో పాగా వేసి అక్కడ సెటిలైపోవాలని అమ్మడు తెగ ప్రయత్నాలు చేస్తోంది. అలాంటిప్పుడు పెద్ద హీరోల పక్కన నటించేటప్పుడు ఎంతవరకు మనసు పెట్టి నటిస్తుందనేది ఎవరికైనా కలిగే సందేహమే. బాలీవుడ్ లో బిజీ స్టార్ అవ్వాలని ఉన్నప్పుడు.. తెలుగులో సరిగ్గా ఫోకస్ చేస్తుందా?