ప్రభాస్ 'సాహో' షూటింగ్ పూర్తి కాకమునుపే తన నెక్స్ట్ ఫిలిం #ప్రభాస్20 షూటింగ్ మొదలు పెట్టారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మెజారిటీ కథ ఐరోపా నేపథ్యంలో జరుగుతుందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. కొన్ని నెలల గ్యాప్ తర్వాత ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో మళ్లీ పాల్గొంటున్నారు.
గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఆస్ట్రియా షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని తిరిగివచ్చారు.. అలా ఎందుకు తిరిగి వచ్చారనేది తెలియదు. ఆ సమయంలో పూజా హెగ్డే అనారోగ్యం బారిన పడడంతో షూటింగ్ జరపడం కుదరలేదట. ఆస్ట్రియా షెడ్యూల్ లో ఎక్కువ భాగం సన్నివేశాలు ప్రభాస్ - పూజ పైన చిత్రీకరించాల్సి ఉందట. అయితే హై ఫీవర్ తో పూజ బాధ పడుతూ ఉండడంతో షూటింగ్ రద్దు చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చారట. ఈ షెడ్యూల్ రద్దు చేయడంతో నిర్మాతలకు భారీగా నష్టం జరిగిందని సమాచారం. అయితే ప్రభాస్..యూవీ క్రియేషన్స్ వారు పూజను ఒక్కమాట కూడా అనలేదట.
నిన్నే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారభమైంది. ఈ షెడ్యూల్ తర్వాత మరోసారి #ప్రభాస్20 టీమ్ ఆస్ట్రియాకు బయలుదేరడానికి రెడీ అవుతున్నారట. 'అల వైకుంఠపురములో' విజయంతో పూజ ఫుల్ హ్యాపీగా ఉందట. ప్రభాస్ సినిమా కూడా తన కెరీర్లో మరో మరపురాని చిత్రం అవుతుందని నమ్మకంగా ఉందట. 'సాహో' తరహాలోనే ఈ సినిమాను కూడా జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.