జిగేల్ రాణి... క‌ళ్లు జిగేల్ మ‌నేలా..

Update: 2018-03-31 05:46 GMT
డీజే భామ పూజా హెగ్దే - రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమాలో జిగేల్ రాణి అంటూ ప్ర‌త్యేక గీతంలో చిందులు వేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట‌కు థియేట‌ర్‌లో రెస్పాన్స్ బాగానే ఉంది. హాట్ హాట్ స్టెప్పుల‌తో కుర్ర‌కారు మ‌తులు పొగొట్టిన ఈ చిన్న‌ది, ఆ వ‌య్యారాల వ‌డ్డింపు వెన‌క ఎంత క‌ష్టం ఉందో చూపిస్తూ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిందీ పాప‌.

పూజా హెగ్దే ఫిజిక్ చాలా బాగుంటుంది. స్లిమ్ గా ఫిట్‌గా ఉంటూనే టూ హాట్‌గా క‌నిపిస్తుంది పూజా హెగ్దే. త‌న శ‌రీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు చాలానే క‌ష్ట‌ప‌డుతోంది పూజా. ఆమె చేసే వ్యాయామాలు చూస్తే... ఎవ్వ‌ర‌రైనా ఆశ్చ‌ర్యంతో నోళ్లెళ్ల‌బెడ‌తారు. అతి క‌ష్ట‌మైన క‌స‌రత్తులు చేస్తూనే... టేకింగ్ బేబీ స్టెప్స్ అని కామెంట్ పెట్టింది పూజా. అంటే ఇది కేవ‌లం ఆరంభం మాత్ర‌మేన‌ట‌. ఆరంభ‌మే ఇంతలా ఉంటే, మున్ముందు ఏ రేంజ్‌ లో వ్యాయ‌మం చేయ‌బోతుందో మ‌రి. అక్కినేని వారి కోడ‌లు స‌మంతలా భారీ బ‌రువులు ఎత్తేసిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదేమో! తెర పైన ఎంత అందంగా క‌నిపించాలంటే, తెర వెన‌క ఇలా జిమ్ముల్లో చెమ‌ట‌లు చిందిస్తూ అంత ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది ముద్దుగుమ్మ‌లు.

ప్ర‌స్తుతం ఎన్‌ టీఆర్‌ - త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌ లో రూపుదిద్దుకోబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది పూజా. ఈ సినిమా కోసం తార‌క్ ఏకంగా 12 కిలోలు త‌గ్గాడు. మ‌రో 5 కిలోలు త‌గ్గాల‌నే టార్గెట్ కూడా పెట్టుకుని క‌స‌ర‌త్తులు కూడా చేస్తున్నాడు. సో... తార‌క్ కంటే ఫిట్‌ గా క‌నిపించాలంటే పూజా హెగ్దే ఈ మాత్రం క‌ష్ట‌ప‌డాల్సిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News