కెరీర్ కోసం నానా తంటాలు ప‌డుతున్న కుర్ర‌బ్యూటీ

Update: 2021-02-02 16:30 GMT
నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ మీద ఉండే నాయిక‌గా పూన‌మ్ బ‌జ్వా పాపుల‌రైంది. వృత్తిపరమైన లేదా వ్యక్తిగతమైనా తన జీవితంలో ప్ర‌తి విష‌యాన్ని ట్విట్ట‌ర్ ఇన్ స్టాలో వెల్ల‌డించ‌డం త‌న‌కో హాబీ.ఇక ఏజ్ తో సంబంధం లేకుండా ఈ భామ ఇన్ స్టాలో ఫోటోషూట్లతో వేడి పెంచుతూనే ఉంది. ఇక ఇటీవ‌లి కాలంలో పూన‌మ్ బ‌జ్వా జీరో సైజ్ కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అధిక బ‌రువు నుంచి లుక్ ని మార్చేందుకు తీవ్రంగానే శ్ర‌మిస్తోంది.

అందుకోసం జిమ్ యోగా అంటూ ప్ర‌ణాళికా బ‌ద్ధంగా జీవిస్తోంది. ఇటీవ‌ల త‌న పాత రూపాన్ని తిరిగి తీసుకురావడానికి హార్డ్ గా శ్ర‌మిస్తోంది.ఇప్ప‌టికి ప‌ర్ఫెక్ట్ షేప్స్ తో రెడీ అయ్యింది. ఇదిగో అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

పూన‌మ్ ఇంత‌కుముందు మోహ‌న్ లాల్ .. నాగార్జున లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించింది. కింగ్ స‌ర‌స‌న బాస్ అనే చిత్రంలో క‌నిపించింది. ఇటీవ‌ల ఆశించినంతగా కెరీర్ ప‌రంగా రాణించ‌క‌పోవ‌డంతోనే ఇలా అందం పై మ‌రింత శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తోంది. బ‌జ్వా తాజా స్లిమ్ లుక్ ప్ర‌స్తుతం అభిమానుల్లో వైర‌ల్ అవుతోంది.
Tags:    

Similar News