సచిన్ పక్కింట్లోకి చేరిపోయింది

Update: 2017-07-04 16:57 GMT
సెన్సేషనల్ బ్యూటీ అనిపించేసుకుని బాలీవుడ్ లో వెలిగిపోవాలని కలలు కన్న పూనమ్ పాండేకు.. సెన్సేషన్స్ తప్పితే వేరేదేమీ దక్కలేదు. బాలీవుడ్ పెద్దగా ఆదరించకపోవడంతో టాలీవుడ్ లో మాలిని అండ్ కో అంటూ ప్రయత్నించింది కానీ ప్రయోజనం లేదు. ఇక ఆ తర్వాత యూట్యూబ్ సెన్సేషన్ గాను.. సోషల్ మీడియాలోనూ హంగామా సృష్టిస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న పూనమ్.. ఇప్పుడు తనను తాను సెన్సేషన్ చేసుకోవడానికి కొత్త రూట్ వెతుక్కుంది.

ఏదో ఒక టాపిక్ తో హంగామా చేసే పూనమ్ పాండే.. ఇప్పుడు సచిన్ ను అడ్డం పెట్టుకుని ప్రచారం కొట్టేయాలని చూస్తోంది. తాజాగా ఈ భామ ఇల్లు ఛేంజ్ అయిందట. అది కూడా సచిన్ టెండూల్కర్ పక్కింట్లోకే చేరిందట ఈ భామ. ముంబైలోని బాంద్రాలో ఉంటున్న సచిన్ ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీసుకుంది ఈ బ్యూటీ. అక్కడి నుంచి ఓ ఇంటర్వ్యూ ఇచ్చి(చేయించుకుంది అని టాక్) అది ఇంటర్నెట్ లోకి చేరిపోయేలా చేసింది. అంతే ఒక్కసారిగా ఈ భామ పేరు మళ్లీ హాట్ టాపిక్ అయిపోయింది. పూనమ్ పాండేకు కావాల్సింది కూడా ఇదే. అందుకే ప్లాన్డ్ గా..  ఆ వీడియోలో తెగ ఎగ్జైట్ అయిపోతున్నట్లు నటించేసింది. ఈ యాక్టింగ్ ఆన్ స్క్రీన్ పై చేయగలిగి ఉంటే.. అవకాశాలు బాగానే వచ్చేవి.

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా తిరిగి గిఫ్ట్ ఇస్తా అంటూ మొదలుపెట్టిన పూనమ్ పాండే.. పాపం సచిన్ రిటైర్ అయినా ఇంకా ఆ క్రికెట్ లెజెండ్ ని వదిలిపెట్టకపోవడం మాత్రం దారుణమే.


Tags:    

Similar News