ముస్లిం హీరోయిన్ కష్టాల చిట్టా వినండి

Update: 2016-11-25 10:26 GMT
జయమ్ము నిశ్చయమ్మురా మూవీ హీరోయిన్ పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం అనే సంగతి తెలిసిందే. పేరులోనే ఈమె ముస్లిం యువతి అని తెలుస్తూనే ఉంది. అయితే.. ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కాస్త కన్జర్వేటివ్ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన ముస్లిం అమ్మాయిలు నిలదొక్కుకోవడం అంత తేలికైన విషయం కాదు. టబు లాంటి మరి కొందరు సీనియర్ హీరోయిన్స్ ఉన్నారు కానీ.. ఎవరి కష్టాలు వారికుంటాయి.

''నేను సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించినా.. మతం నేను హీరోయిన్ గా మారేందుకు అడ్డంకి కాలేదు. నా నిర్ణయాలకు కుటుంబం నుంచి మద్దతు లభించింది. మా అమ్మ బాగా సపోర్ట్ చేసింది. మా ఊళ్లో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ఏకైక ముస్లిం అమ్మాయిని నేనే. నాకు ముగ్గురు అక్కలు.. ఒక అన్న ఉన్నారు. వారంతా నేను సినిమాల్లోకి వెళతానని చెప్పినపుడు సంతోషించిన వారే'' అని చెప్పిన పూర్ణ.. ఆ తర్వాత తనకు ఎదురైన కష్టాల చిట్టా విప్పింది.

''కొంత మంది నన్ను అంత చిన్నబట్టలు వేసుకుంటున్నావు.. బొట్టు పెట్టుకుంటున్నావు.. అసలు ముస్లింవేనా అని అడిగేవారు. ఓ పాత్ర కోసం కాసేపు బొట్టు పెట్టుకుంటే నేను ముస్లింని కాదని అర్ధం కాదు. అయితే.. సీమ టపాకాయ్ సినిమా కోసం లిప్ లాక్ చేయాల్సి రావడం మా అన్నను బాధ పెట్టింది. తను అప్పుడు సౌదీలో ఉన్నాడు. తన స్నేహితులు ఎలాంటి కామెంట్స్ చేసి ఉంటారో ఊహించుకోగలను. తమ పిల్లలను ఎవరైనా ఏమైనా నెగిటివ్ గా అంటే ఎవరికైనా బాధ వేస్తుంది కదా. నన్ను అంతగా తన కూతురులా చూసుకుంటారు నా సహోదరులు'' అంటోంది పూర్ణ.

అయితే ఎవరేమనుకున్నా తనకు తన కుటుంబమే ముఖ్యం అని చెప్పింది కూడా. ఇప్పటికీవారు ఎక్సపోజింగ్ చేయకు.. లిప్ లాక్స్ వద్దు అంటూ ఎటువంటి కండీషన్లు ఏం పెట్టట్లేదు. గ్రేట్ కదూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News