హార్ట్ ఎటాక్ బ్యూటీ '?' కు మంచి డిమాండ్
డాషింగ్ డైరెక్టర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ముద్దుగుమ్మ అదాశర్మ కు ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు. దాంతో ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. ఇతర భాషల్లో అడపా దడపా సినిమాలు చేస్తే తెలుగులో కూడా వచ్చిన ఆఫర్లను చేసుకుంటూ వస్తున్న ఈ అమ్మడు తాజాగా '?' (క్వశ్చన్ మార్క్) అనే సినిమాను చేస్తోంది. విప్రా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను గౌరీ కృష్ణ నిర్మించాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
విడుదలకు సిద్దం అయిన ఈ సినిమాలోని రామసక్కనోడివిరో.. అనే పాటను విడుదల చేశారు. పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రఘు కుంచే సంగీతం అందించిన ఆ పాటను మంగ్లీ పాడటంతో ప్రేక్షకుల నుండి ఆధరణ పొందింది. పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై జనాల్లో ఆసక్తి కలిగింది. దాంతో ప్రముఖ ఓటీటీ ఈ సినిమాను మంచి రేటుకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా నిర్మాత గౌరీ కృష్ణ పేర్కొన్నాడు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.