పోసాని కృష్ణమురళి రైటర్ గా మాత్రమే కాదు.. యాక్టర్ గా కూడా బోలెడంత గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే.. రచయితగా కంటే నటుడిగానే ఎక్కువ కీర్తి గడించాడు. అలాగే సూటిగా మాట్లాడ్డంలో కూడా పోసానికి తిరుగు లేదు. రాజకీయాలపై కూడా అవగాహన ఉన్న ఈయన.. పొలిటికల్ డిస్కషన్స్ లో కూడా నిష్కర్షగా తన వాదన వినిపించగలడు.
ఇప్పుడు యాత్ర అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం ఖాయం అయిపోయింది. మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్న విషయాన్ని యాత్ర ఫస్ట్ లుక్ ద్వారా చెప్పేశాడు దర్శకుడు మహి వి రాఘవ. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు పోసాని కృష్ణ మురళిని ఖాయం చేశారనే వార్తలు సంచలనం అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు పోసాని ఏ మాత్రం సంకోచించడం లేదు.
అలాంటి సమయంలో వైఎస్ఆర్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. ఆయన పాదయాత్రను మెయిన్ థీమ్ గా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలో పోసానికి ఏ పాత్రను ఆఫర్ చేశారనే అంశం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అయిపోయింది. ఇది కచ్చితంగా వైసీపీకి సపోర్టింగ్ గా ఉండే రోల్ అని.. వైసీపీ లీడర్స్ లో ఓ ముఖ్యమైన నాయకుడి పాత్రను పోసానికి ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ చిత్రంలో జగన్మోహన్ రెడ్డి పాత్రలో సూర్యను ఒప్పించేందుకు ట్రై చేస్తున్నారనే న్యూస్ మరో సెన్సేషన్.