సుశాంత్ సింగ్ మృతిపై పోస్ట్ మార్ట‌మ్ స్టాఫ్‌ సంచ‌ల‌నం!

Update: 2022-12-26 10:46 GMT
బాలీవుడ్ క్రేజీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రెండేళ్ల క్రితం 2020 జూన్ 14న అనుమానాస్ప‌దంగా మృతి చెంద‌డం దేశ వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లాన్ని సృష్టించింది. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే విభిన్న‌మైన సినిమాల‌తో ఎదుగుతున్న హీరో ఇలా అక‌స్మాత్తుగా మృత్యువాత ప‌డ‌టం ఏంట‌ని అంతా ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. అత‌నిది ఆత్మ హ‌త్య కాద‌ని హ‌త్యేన‌ని, ఎవ‌రో కావాల‌ని అత‌న్ని హ‌త్య చేశారంటూ దేశ వ్యాప్తంగా పెద్ద దుమార‌మే రేగింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కూడా త‌న త‌న‌యుడిగా ఆత్మ హ‌త్య కాద‌ని, ముమ్మాటికీ హ‌త్యేన‌ని వాదించాడు. పోలీసుల‌ని కూడా సంప్ర‌దించాడు. సుశాంత్ సింగ్ హృతి త‌రువాత అత‌ని బాడీని పోస్ట్ మార్ట‌మ్ నిమిత్తం కూప‌ర్ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. ఆ త‌రువాత నుంచి సుశాంత్ హ‌ఠాణ్మ‌ర‌ణంపై ప‌లు సంచ‌ల‌న క‌థ‌నాలు వినిపిస్తూనే వున్నాయి. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై పోస్ట్ మార్ట‌మ్ రిపోర్ట్ అందించిన రూప్ కుమార్ షా షాకింగ్ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృత‌దేహానికి పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించిన రూప్ కుమార్ షా తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. రెండేళ్ల అనంత‌రం స్పందించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణించిన‌ప్పుడు కూప‌ర్ హాస్పిట‌ల్ లో ఐదు మృత‌దేహాల‌కు పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించాం. అందులో ఒక‌టి వీఐపీ మృత‌దేహం. పోస్ట్‌మార్ట‌మ్ చేయ‌డానికి వెళ్లిన‌ప్పుడు ఆ వీఐపీ మృత దేహం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది అని తెలిసింది.

అత‌ని బాడీపై అనేక గుర్తులున్నాయి. అంతే కాకుండా అత‌ని మెడ‌పై మూడు గాయాలున్నాయి. అది గ‌మ‌నించాం. పోస్ట్ మార్ట‌మ్ రికార్డ్ చేయాల్సింది. అయితే ఉన్న‌తాధికారులు మాత్రం ఫొటోలు మాత్ర‌మే తీయాల‌ని చెప్పారు. అందుకే వారి ఆదేశాల ప్ర‌కార‌మే ఫొటోలు మాత్ర‌మే తీశాం అని తెలిపారు. అంతే కాకుండా ఆయ‌న మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డించారు. సుశాంత్ సింగ్ బాడీని చూసిన వెంట‌నే తాను ఇది సూసైడ్ కాద‌ని, మ‌ర్డ‌ర్ అని పై అధికారుల‌కు తెలియజేశాన‌ని, అయితే సీనియర్స్ మాత్రం పోలీసులు చెప్పిన‌ట్టుగా చేయ‌మ‌న్నార‌ని.

ఎంత త్వ‌ర‌గా పోస్ట్ మార్ట‌మ్ అయితే అంత త్వ‌ర‌గా చేసి పోలీసుల‌కు బాడీని అప్ప‌గించ‌మ‌న్నార‌ని, వారు చెప్పిన‌ట్టే తాను చేశాన‌న్నాడు. ప్ర‌స్తుతం రూప్ కుమార్ షా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.
అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మ హ‌త్య అంటూ పోలీసులు తేల్చేసిన విష‌యం తెలిసిందే. త‌ను చ‌నిపోయి రెండేళ్ల‌కు పైనే అవుతున్నా త‌న మ‌ర‌ణం వెన‌కున్న ర‌హ‌స్యం ఇంత వ‌ర‌కు బ‌య‌టికి రావ‌డం లేద‌ని సుశాంత్ అభిమానులు వాపోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News