ట్రెండ్‌ : బన్నీ ఉంటే కోవిడ్ ఉండదు..!

Update: 2022-01-02 02:30 GMT
సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా వాయిదా అని అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా ఉత్తరాదిన ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. వచ్చే వారంలో లాక్ డౌన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. థియేటర్ల వద్ద ఆంక్షలు.. నైట్‌ కర్ఫ్యూలు.. బంద్ లు ఇన్ని రకాల ఇబ్బందుల మద్య ఆర్ ఆర్‌ ఆర్ ను విడుదల చేయడం కరెక్ట్‌ కాదని అంతా భావించారు.. అంతా అనుకున్నట్లుగానే మేకర్స్ కూడా సంక్రాంతి బరి నుండి తమ సినిమాను వెనక్కు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. రాధేశ్యామ్‌ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ అంతా బలంగా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ ను తెగ షేర్‌ చేస్తున్నారు.

ఈమద్య కాలంలో పుష్ప లో బాగా ఫేమస్ అయిన డైలాగ్‌ ను కాస్త మార్చి అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అదే బన్నీ ఉంటే కరోనా ఉండదు.. కరోనా ఉంటే బన్నీ ఉండడు. ఔను నిజమే గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమా తో వచ్చిన సమయంలో బన్నీకి కరోనా దెబ్బ పడలేదు. అల వైకుంఠపురంలో సినిమా లాంగ్‌ రన్ పూర్తి అయిన తర్వాత అప్పుడు కరోనా కేసులు పెరగడం మొదలు అయ్యింది. కరోనా వల్ల పుష్ప సినిమా వాయిదా పడింది.. కాని సినిమా విడుదల అనుకున్న తేదీకి అయ్యింది. ఇటీవల విడుల అయిన పుష్ప ఏకంగా మూడు వందల కోట్ల వసూళ్లను దక్కించుకుని ఈ ఏడాది ఇండియన్‌ బిగ్గెస్ట్‌ చిత్రాల జాబితాలో టాప్ లో నిలిచింది.

పుష్ప విడుదల సమయంలో కాని రన్ అవుతున్న రోజుల్లో కాని కరోనా గురించి ఆందోళన లేదు. పుష్ప విడుదల అయ్యి రెండు వారాలు అయ్యింది. ఇప్పుడు మెల్ల మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మూడవ వారం రన్‌ పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయిలో కరోనా విజృంభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంటే గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాకు ఎలా అయితే సినిమా రన్ పూర్తి అయిన తర్వాత వైరస్ ఎటాక్ మొదలు అయ్యిందో ఇప్పుడు పుష్ప పూర్తిగా థియేటర్ల నుండి వెళ్లి పోయాక కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే అభిమానులు అంటున్నట్లుగా బన్నీ ఉంటే కరోనా ఉండదు.. కరోనా ఉంటే బన్నీ ఉండడు అనే డైలాగ్‌ యాప్ట్‌ అనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఈ డైలాగ్‌ ను అల్లు అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News