యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ''లవ్ స్టోరీ'' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై నారాయణదాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మించారు. ఈ చిత్రం కోసం మేకర్స్ బాగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే 'వకీల్ సాబ్' సినిమా కారణంగా 'లవ్ స్టొరీ' చిత్రానికి థియేట్రికల్ రిటర్న్స్ ఏమాత్రం వస్తాయనే దానిపై డిస్కషన్ జరుగుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగి సినిమా బాగుందనే టాక్ వస్తే పవన్ సినిమా ఇంపాక్ట్ రెండు వారాలు కచ్చితంగా ఉంటుంది. ఇది 'లవ్ స్టోరీ' ఓపెనింగ్ కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒకవేళ 'వకీల్ సాబ్' కొంచెం అటు ఇటు అయితే మాత్రం 'లవ్ స్టొరీ' కలెక్షన్ల పంట పండినట్లే. ఓపెనింగ్స్ తో పాటు సినిమా బాగుంటే డబుల్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. 'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమా కావడం.. 'మజిలీ' 'వెంకీమామ' వంటి వరుస విజయాల తర్వాత చైతన్య నటిస్తున్న సినిమా కావడంతో 'లవ్ స్టొరీ'పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.