నిజంగానే 'పవర్ స్టార్' అంత కలెక్ట్ చేసిందా...?

Update: 2020-07-27 01:30 GMT
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ''పవర్ స్టార్'' సినిమా నిన్న ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల అయింది. ఈ సినిమాతో ఆర్జీవీ నటుడిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మీద తీసిన సినిమా కాదని వర్మ ఇప్పటికీ చెప్తున్నా పవన్ గత ఎన్నికలలో ఓడిపోవడానికి కారణం తన పక్కన కొందరు భజన బ్యాచ్ కారణమనే కోణంలో ఆలోచించి ఈ సినిమా రూపొందించారు. 'పవర్ స్టార్' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చెలరేగిన వివాదాలతో పాటు వర్మ పబ్లిసిటీ స్టంట్ కూడా కలిసి ఈ మూవీపై బాగా హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమాని చాలా మందే చూసారని తెలుస్తోంది. దీనిపై వర్మ మాట్లాడుతూ 'నిబంధనల ప్రకారం తాను వ్యూస్ లెక్క చెప్పటం లేదు కానీ.. తొలి రోజు వచ్చిన వ్యూస్ లెక్క చెబితే ఇండస్ట్రీలోని కొందరి గుండెలు ఆగిపోతాయి.. అసూయతో చచ్చిపోతారు' అని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలోని కొంతమంది నిజంగానే రామ్ గోపాల్ వర్మకి ''పవర్ స్టార్'' మూవీ అన్ని డబ్బులు తెచ్చిపెట్టిందా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మూవీ విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ మూవీ పైరసీ వీడియోలు బయటికి రావడం జరిగింది. దీనితో పైరసీ సైట్స్ లో 'పవర్ స్టార్' మూవీని చాలామంది పేక్షకులు ఫ్రీగా చూసేశారు. దీంతో వర్మ ఎక్సపెక్ట్ చేసిన అమౌంట్ రాకపోయి ఉండొచ్చని అంటున్నారు. ఐతే అడ్వాన్స్ టికెట్ ధర 150 రూపాయలుగా పెట్టిన వర్మ నిన్న రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బుకింగ్ లెక్కన 250 రూపాయలు చేసారు. ఈ లెక్కన చూసుకుంటే వర్మ బాగానే లాభాలు గడించారు అనేవారు కూడా లేకపోలేదు.

ఇంతకముందు 'క్లైమాక్స్' 'నగ్నం' సినిమాలకి కూడా ఆర్జీవీ అనుకున్నదానికంటే ఎక్కువ మొత్తంలో వసూళ్లు వచ్చాయని సమాచారం. ఇప్పుడు పవర్ స్టార్ విషయంలో కూడా అదే జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలుగు ఫిలిం థియేటర్స్ లో 'శివ' కి ముందు 'శివ' తర్వాత అని ఎలా మాట్లాడుకుంటారో ఆన్లైన్ థియేటర్స్ లో 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' కి ముందు తర్వాత అని మాట్లాడుకుంటారని చెప్తున్నాడు వర్మ. మొత్తం మీద కరోనా సమయంలో కూడా సంపాదిస్తున్న ఏకైక ఫిలింమేకర్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పవచ్చు.
Tags:    

Similar News