‘వకీల్ సాబ్’తో పవర్ స్టార్ గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చారు. మహిళల తరపున పోరాడే లాయర్ పాత్రలో విశ్వరూపం చూపించారు పవన్. ఈ సినిమా తర్వాత మరో మూడు చిత్రాలు లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భల్లాల దేవ రానాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ ఒకటికాగా.. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న పీరియాడికల్ పవర్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘హరిహర వీరమల్లు’. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత హరీష్ శంకర్ మూవీ లైన్లోకి రానుంది.
అయితే.. పార్టీని నడిపేందుకే మళ్లీ సినిమాలు తీస్తున్నానని చెప్పారు పవన్. దాన్ని నిజం చేస్తూ.. వరుసగా సినిమాలు అనౌన్స్ చేశారు. రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు వరకు పవన్ నుంచి ఏడాదికి ఒక చిత్రం వస్తే గొప్ప అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ.. ఇప్పుడు సాధ్యమైనంత తక్కువ కాలంలో.. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలన్నదే పవన్ కాన్సెప్ట్.
ఇందులో భాగంగానే ఒకేసారి నాలుగు సినిమాలను అనౌన్స్ చేసిన పవన్.. ముందుగా వకీల్ సాబ్ ను వదిలాడు. ఒక్కో సినిమా అంటే టైమ్ ఎక్కువ పడుతుందని భావించారేమో.. ఏకంగా రెండు సినిమాలను ఏకకాలంలో సెట్స్ పైకి తెచ్చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభించే వరకూ ఏకే రీమేక్, వీరమల్లు సెట్స్ కు షిఫ్ట్ ల వారీగా వెళ్లేవారు పవర్ స్టార్. ఉదయం ఒక షూటింగులో, మధ్యాహ్నం మరో సెట్ లో కనిపిస్తూ.. పార్ లాల్ గా నడిపించారు.
సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో షూటింగులు ఆగిపోవడం, పవన్ కూడా కొవిడ్ బారిన పడడంతో అంతా మారిపోయింది. లేటెస్ట్ ప్డేట్ ప్రకారం పవన్ పూర్తి ఫిట్ గా సిద్ధమయ్యారని తెలుస్తోంది. షూటింగులు ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు సెట్స్ కు వెళ్లేందుకు రెడీగా ఉన్నారట. అంతేకాదు.. రెండు షూటింగులనూ గతంలో మాదిరిగానే ఏకకాలంలో రన్ చేయాలని మేకర్స్ కు చెప్పారట. మొత్తానికి మరోసారి పవర్ ఫుల్ డెసిషన్ తీసుకున్నారన్నమాట.
కాగా.. ఇందులో వీరమల్లును సంక్రాంతికి వదలాలని అనుకున్నారు. ఏకేను అంతకన్నా ముందే సెప్టెంబర్ నాటికే రిలీజ్ చేయాలని అనుకున్నారు. మరి, మారిన పరిస్థితుల నేపథ్యంలో చిత్రీకరణ ఎప్పుడు పూర్తవుతుందో? రిలీజులు ఎప్పుడు పెట్టుకుంటారో చూడాలి.