పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పిరియాడిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ కాలంలో పేదలకోసం దోపిడీలు చేసే బందిపోటు పాత్రలో పవన్ కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమా హాలీవుడ్ రాబిన్ హుడ్ తరహాలో సాగుతుందట. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుండగా మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఎంపికయ్యింది. అయితే ఈరోజు నిర్మాత ఏఎం రత్నం పుట్టినరోజు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ఏఎం రత్నం గురించి తన అనుబంధాన్ని బయటపెట్టాడు. టాలీవుడ్ మార్కెట్ పరిధి పెంచడంలో రత్నం గారి పాత్ర మరువలేనిదని కొనియాడాడు.
ఇప్పటివరకు తనతో సినిమా చేయమని ఏ నిర్మాతను అడగలేదని.. కేవలం ఏఎం రత్నం గారిని మాత్రమే అడిగానని పవన్ చెప్పాడు. ఆయనతో పరిచయం ఇప్పటిది కాదు. నెల్లూరులో రత్నంగారి బంధువు ఒకరు నా మిత్రుడు. అతని ద్వారా రత్నంగారిని చెన్నైలో కలిసేవాడిని. నా లైఫ్ లో `ఖుషీ` లాంటి అద్భుతమైన సినిమాను అందించారు రత్నం. సినిమా గురించి ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి మన సినిమాల మార్కెట్ పరిధి పెంచారు. ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నట్లు పవన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న పీరియడిక్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా పవన్ విరూపాక్షతో పాటు అయ్యప్పనుమ్ కోషియం సినిమా చేస్తున్నాడు. ఇక వకీల్ సాబ్ ఏప్రిల్ లో విడుదల అవుతోంది.