ఇకపై భాషా యాస మార్చనున్న పవర్ స్టార్..!

Update: 2021-04-17 06:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్ డే నుండే మంచి వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికి థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఇప్పటికే సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలలో టాక్. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చేస్తూనే నాలుగు సినిమాలకు ఓకే చెప్పిన విషయం విదితమే. అయితే ఈ నాలుగు సినిమాల్లో నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అందులోను క్యారెక్టర్ భాషా యాసలో కూడా వెరియేషన్ ఫాలో అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వకీల్ సాబ్ సినిమాలో న్యాయవాదిగా తెలంగాణ యాసలో అలరించాడు పవన్.

అయితే తదుపరి సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో పవన్ రాయలసీమ యాసలో మాట్లాడనున్నాడు. ఇప్పటికే రాయలసీమ మాండలికం లో రానాతో పోరు అదిరిపోనుందని టాక్. అలాగే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పీరియడిక్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్కళ్యాణ్ అచ్చతెలుగు గ్రాంథిక భాషలో అలరించబోతున్నాడు. అంతేగాక మాస్ డైరెక్టర్ హరీష్ శంక‌ర్ సినిమాలో పవన్ యూనివర్సల్ తెలుగు యాసలో సందడి చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాలలో డిఫరెంట్ పాత్రలలో డిఫరెంట్ యాసలలో ఎంటర్టైన్ చేయనున్నాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు.
Tags:    

Similar News