సినీ రంగంలో తరచుగా ‘కాంప్రమైజ్’ అనే మాట వినిపిస్తుంటుంది. దర్శకులు.. హీరోలు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. మా నిర్మాత ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు.. కథను నమ్మి ఖర్చు పెట్టాడు.. అని అంటుంటారు. ‘పడి పడి లేచె మనసు’ హీరో శర్వానంద్.. దర్శకుడు హను రాఘవపూడి కూడా ఇలాగే మాట్లాడారు. అలా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించిన పాపానికి ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయే పరిస్థితికి వచ్చాడు కొత్త ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి. నిర్మాతగా తన తొలి సినిమా అయిన ‘పడి పడి లేచె మనసు’ మీద ఆయన హద్దులు దాటి ఖర్చు పెట్టేశాడు. ఈ విషయంలో హీరో శర్వానంద్ ను.. దర్శకుడు హను రాఘవపూడిని నమ్మాడాయన. శర్వా ప్రొడక్షన్ చూసుకుంటాడని కాదు కానీ.. అతను వరుస విజయాల మీద ఉండటంతో సినిమా మీద ధైర్యంగా ఖర్చు పెట్టొచ్చనుకున్నాడు. ఆ విషయంలో తప్పేమీ లేదు.
కానీ దర్శకుడు హనును అతిగా నమ్మడమే ఆయన కొంప ముంచింది. కొత్తవాడు కావడంతో ప్రొడక్షన్ మీద ఆయనకు పట్టు లేకపోయింది. హను ఇప్పటికే మూడు సినిమాలు తీయడంతో అంతా అతను చూసుకుంటాడని అనుకున్నాడు. కానీ హను ఆయన నమ్మకాన్ని నిలబెట్టలేదు. వర్కింగ్ డేస్ చాలా పెంచేశాడు. ఎక్కడెక్కడో షూట్ చేశాడు. రీషూట్లు జరిగాయి. ఖరీదైన లొకేషన్లు ఎంచుకున్నాడు. ఇలా అడ్డూ అదుపు లేకుండా ఖర్చు పెట్టించేసి సినిమా బడ్జెట్ రూ.30 కోట్లు దాటించేశాడు. శర్వా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చినా రూ.25 కోట్ల షేర్ దాటే పరిస్థితి లేదు. అలాంటిది బడ్జెట్టే రూ.30 కోట్లు దాటితే ఏం చేయాలి. మిగతా ఖర్చులన్నీ కలిపితే రూ.35 కోట్ల దాకా రికవర్ చేస్తే తప్ప సినిమా సేఫ్ అవ్వని పరిస్థితి.
తన గత సినిమా ‘లై’ విషయంలోనూ ఇలాగే పరిమితికి మించి ఖర్చు పెట్టించి నిర్మాతల్ని ముంచేశాడు హను. అతడి దెబ్బకు ‘14 రీల్స్’ లాంటి పెద్ద సంస్థ సినిమాల ప్రొడక్షనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత కూడా జాగ్రత్త పడలేదు. కొత్త నిర్మాత తనను అంత నమ్మితే అయిన కాడికి ఖర్చు పెట్టించి అతడినీ కోలుకోలేని దెబ్బ తీశాడు హను. అతడిలో ఎంత టాలెంట్ ఉంటే ఏంటి. నిర్మాతల క్షేమం చూడనపుడు? ఇలాంటి దర్శకుడిని నమ్మి ఇంకో నిర్మాత సినిమా చేయడానికి ముందుకొస్తాడా?