ఫీజ్ వద్దు. కాళకేయను పరిచయం చేయండి

Update: 2015-08-02 06:03 GMT
బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత .. నా జీవితంలో కనిపించిన తాజా మార్పు ఇది. బాహుబలి నా స్టాటస్‌ నే మార్చేసింది. అభిమానుల్ని ఘననీయంగా పెంచిందని మురిసిపోతున్నాడు ప్రభాకర్‌. నన్ను ఇప్పుడంతా కాళకేయ ప్రభాకర్‌ అని పిలుస్తున్నారు. మర్యాద రామన్న సినిమా తర్వాత మర్యాద రామన్న ప్రభాకర్‌ అనేవారు. కానీ ఇప్పుడు కాళకేయ ప్రభాకర్‌ గా గుర్తింపు దక్కింది. ఇటీవలే సికిందరాబాద్‌లోని స్కంధగిరి టెంపుల్‌ కి వెళ్లాను. అక్కడ నన్ను జనం చుట్టు ముట్టేశారు. మునుపటితో పోలిస్తే నా ఖ్యాతి ఎంత పెరిగిందో అప్పుడర్థమైంది... అని చెప్పాడు ప్రభాకర్‌.

మా అమ్మ ఓ విలేజీలో ఉంటుంది. ఈ వీకెండ్‌ లోనే బాహుబలి సినిమా చూసింది. అంతకంటే ముందే కాళకేయగా నేను ఎలా నటించానో ఊరివాళ్లంతా అమ్మకు చెప్పారు. తెరపై నన్ను చూసిన అమ్మ అద్భుతం అనుకుంది. అంతేనా ఓరోజు సుస్తీ చేస్తే ఆస్పత్రికి వెళ్లింది అమ్మ. అక్కడ డాక్టర్‌ గారు.. కాళకేయకు అమ్మగారు కదూ.. ఫీజ్‌ వద్దు. నాకు ఆయన్ని పరిచయం చేయండి చాలు అంటూ వాపస్‌ ఇచ్చారు డాక్టర్‌ గారు. అదీ నా ఇన్‌ ఫ్లూయెన్స్‌ అంటూ మురిపెంగా చెప్పుకొచ్చాడు ప్రభాకర్‌.
Tags:    

Similar News