గత నెల రోజులుగా వార్తల్లో నిలుస్తున్న ప్రాజెక్ట్ `రాజా డీలక్స్`. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి ఈ మూవీని తెరకెక్కించబోతున్నారని, యువీ క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించబోతోందని వార్తలు వినిపించడం తెలిసిందే. కామెడీ అంశాల నేపథ్యంలో సాగే హారర్ కామెడీ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారని, ఈ మూవీ కథ మొత్తం ఓ థియేటర్లో జరుగుతుందని, దాని పేరు రాజా డీలక్స్ అని, ఆ కారణంగానే ఈ మూవీకి `రాజా డీలక్స్` అనే టైటిల్ ని ఫైనల్ చేశారన్నది తెలిసిందే.
అయితే మారుతి తాజాగా తెరకెక్కించిన `పక్కా కమర్షియల్` మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీని కామెడీ ప్రధానంగా సాగే కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందించారు. సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై అటు మారుతి, ఇటు హీరో గోపీచంద్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఫలితం మాత్రం వారిని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో ఇంతకీ ప్రభాస్ - మారుతి ఫిల్మ్ వుందా? అనే చర్చ మొదలైంది.
`పక్కా కమర్షియల్` ఫలితం తరువాత ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని, ఇది ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్సే లేదనే గుస గుసలు వినిపించాయి. కానీ యువీ క్రియేషన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలనే ఆలోచనలో వుందట. ప్రభాస్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా అనుష్క, మాళవిక మోహనన్ నటించనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాళవిక మోహనన్ .. మారుతి - ప్రభాస్ ప్రాజెక్ట్ లపై ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిందట. తెలుగులో చేయబోతున్న తొలి ప్రాజెక్ట్ గురించి అడిగితే త్వరలోనే ప్రొడ్యూసర్స్ అధికారికంగా ప్రకటిస్తారని స్పష్టం చేసిందట.
దీంతో ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం అని తెలుస్తోంది. మాళవిక క్లారిటీతో ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారనే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడిందని అంటున్నారు. గతంలో ఇదే ప్రాజెక్ట్ గురించి ప్రశ్నిస్తే కామెంట్ లు చేసిన మాళవిక ఇప్పడు మాత్రం అది నిర్మాతలే చెబుతారంటూ క్లారిటీ ఇవ్వడం విశేషం.
మాళవిక మోహనన్ చెప్పిందే నిజమైతే మారుతి అంత అదృష్టవంతుడైన దర్శకుడు మరొకరు వుండరన్నది ఇండస్ట్రీ వర్గాల వాదన. ఫ్లాపుల్లో వున్న దర్శకుడికి, అందులోనూ భారీ చిత్రాలు ఇంత వరకు టచ్ చేయని దర్శకుడికి ప్రభాస్ అవకాశం ఇవ్వబోతున్నారన్నది నిజంగా వండర్ అని..ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.