డూప్ సన్నివేశాలకు కాలం చెల్లింది. సన్నివేశం పండాలంటే వాస్తవికత ఉట్టిపడాల్సిందే. అందులోనూ రొమాంటిక్ సన్నివేశౄలు రక్తికట్టాలంటే మరింత వాస్తవికతను ఆవిష్కరించాలి. ఆషామాషీగా..తూతూ మాత్రంగా ఇంటిమేట్ సన్నివేశాలు చేసేస్తామంటే మేకర్స్ ఒప్పుకోరు. ఆన్ సెట్స్ కి వెళ్లిన తర్వాత అందరూ ముందు దర్శకుడు చెప్పినట్లు చేయాల్సిందే. సరిగ్గా ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ని తొలిసారి ప్రభాస్ ఫేస్ చేసారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ -పూజా హెగ్డే జంటగా నటించిన `రాధేశ్యామ్` మార్చి 11న రిలీజ్ అవుతోన్న సందర్భంగా టీమ్ అంతా ప్రచారం పనుల్లో నిమగ్నమైంది.
దీనిలో భాగంగా ప్రభాస్-పూజా హెగ్డే సైతం చురుకుగా ప్రమోషన్ లో పాల్గొంటున్నారు. `రాధేశ్యామ్` రొమాంటిక్ పీరియాడిక్ లవ్ స్టోరీ అని తెలిసిందే. ఇలాంటి సినిమాలో ఇంటిమేట్ సీన్లు...పెదవి ముద్దులు సహజంగానే ఉంటాయి.ఆ కారణంగా ప్రభాస్ ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బంది పడినట్లు ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. పూజాహెగ్డే తో కొన్ని పెదవి ముద్దు సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డారుట. సహజంగానే బాగా సిగ్గరి ప్రభాస్.
అదీ కెమెరా ముందు ఇలాంటి సీన్లు చేయాలంటే మరింత షై ఫీలైనట్లు తెలిపారు. ``రొమాంటిక్ సనిమా కాబట్టి ఇంటిమేట్ సన్నివేశాలకి నో చెప్పలేకపోయాను. కమర్శియల్ సినిమాల్లో అయితే ఏదో లా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడా ఛాన్స్ లేదు. సీన్ చాలా డిమాండ్ చేస్తుంది. కాబట్టి తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే అందరూ మందు నటించనను చెప్పా. ఓ ప్రయివేట్ ప్లేస్ అయితే ఒకే అన్నా. అందుకు దర్శకుడు ఒకే చెప్పగానే ఓ రహస్య ప్రదేశంలో ముద్దు సన్నివేశాలు చిత్రీకరించినట్లు`` తెలిపారు.
ఆ సన్నివేశంలో ప్రభాస్ చొక్కా కూడా విప్పారుట. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం ప్రభాస్ ఇదే తొలిసారి. ఇప్పటివరకూ డూప్ తో మ్యానేజ్ చేసారు. `బిల్లా`.. `పౌర్ణమి` సినిమాలో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలుంటాయి. అవి పూర్తిగా డూప్ తో కూడినవే. కానీ ఇప్పుడు డూప్ లు అంటే కుదరవు. సీన్ పండాలంటే రియాల్టీ చూపించాల్సిందే. ఆ రకంగా ప్రభాస్-పూజా హెగ్డే ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సినిమాలు హైలైట్ కానున్నాయి. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం పూజా హెగ్డేకి కొత్తేం కాదు. కెరీర్ ఆరంభంలోనే `మొహజందారో` లో హృతిక్ రోషన్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. అవి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.