ప్రయోగాలు చేయడంలో టాప్ హీరోలు ముందు వరుసలో ఉంటున్నారు. బాలీవుడ్ లో ఖాన్ లు, బిగ్ బి చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. టాలీవుడ్ లోనూ అగ్ర కథానాయకులు ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించారు. విలక్షణత, వైవిధ్యం పాటించి సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ని కొనసాగించగలిగారు. ఇటీవల మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న సినిమాల్ని పరిశీలిస్తే దంగల్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రాల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో కనిపించాడు. అలాగే కింగ్ ఖాన్ షారూక్ సైతం `జీరో` చిత్రంలో మరుగుజ్జు పాత్రలో నటించి వైవిధ్యం అంటే ఏంటో చూపించాడు. జయాపజయాల మాట ఎలా ఉన్నా ప్రయోగాల బాటలో వెళ్లేందుకు హీరోలు ఇష్టపడతారనేందుకు ఇవన్నీ ఉదాహరణలు.
ఇప్పుడు అదే బాటలో డార్లింగ్ ప్రభాస్ కూడా తనని తాను ఎలివేట్ చేసుకోవాలని భావిస్తున్నాడా? అంటే అతడి అడుగులు పరిశీలిస్తే అవుననే అర్థమవుతోంది. బాహుబలి సిరీస్ తో మ్యాకోమ్యాన్ గా ప్రభాస్ తనని తాను ఆవిష్కరించుకున్న తీరు మైమరిపించింది. రాజాధి రాజ అమరేంద్ర బాహుబలిగా విరోచిత పోరాటాలతో ప్రభాస్ అదరగొట్టాడు. 2000 కోట్లు వసూలు చేసిన సినిమాలో కథానాయకుడయ్యాడు. ఆ వెంటనే ఆ జోనర్ తో ఏ సంబంధం లేని కొత్త కథల్ని ఎంచుకుని చకచకా షూటింగులు చేసేస్తున్నాడు.
ప్రభాస్ నటిస్తున్న `సాహో` భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో అతడి పాత్రలో బోలెడంత సర్ ప్రైజ్ ఉంటుందని టీమ్ చెబుతోంది. ప్రభాస్ ఓ స్పై తరహా పోలీస్ (స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్) గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `జాన్` (వర్కింగ్ టైటిల్) పూర్తిగా విభిన్నమైన ఎటెంప్ట్. ఇందులో ఓ లవర్ బోయ్, కాలేజీ బోయ్ గా కనిపించున్నాడు. యూరఫ్ నేపథ్యంలో ప్రేమకథా చిత్రమిదని, ప్రభాస్ ఖరీదైన కార్ల వ్యాపారిగానూ, ప్రేమికుడిగానూ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తాడని ప్రచారమవుతోంది. అయితే బాహుబలి తర్వాత చేస్తున్న ఈ వరుస ప్రయోగాలతో తన స్టార్ డమ్ ని ఇంకా ఇంకా పెంచుకుంటాడా లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఆగస్టులో `సాహో` చిత్రాన్ని, ఏడాది చివరిలో `జాన్` చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Full View