'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మోస్ట్ పాపులర్ హీరోగా వెలుగొందుతున్నారు. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ క్రేజ్ ని ఉపయోగించుకొని ఇతర సినిమాలు కూడా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంటున్నాయి. డార్లింగ్ ద్వారా తమ సినిమాకు సంబంధించిన కంటెంట్ ని జానాల్లోకి తీసుకెళ్లి లాభపడుతున్నారు. ప్రభాస్ కూడా తన మంచితనంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ సినిమాకు తన వంతు సపోర్ట్ అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ''రొమాంటిక్'' సినిమా ప్రమోషన్స్ బాధ్యత తీసుకున్నారు ప్రభాస్.
దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న ''రొమాంటిక్'' సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ భాగం పంచుకున్నారు. మీడియా ముఖంగా ట్రైలర్ ను లాంచ్ చేసి సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చి పెట్టారు. అలానే ఆకాష్ పూరితో కలిసి ప్రభాస్ ఓ డైలాగ్ తో 'రొమాంటిక్ రీల్' చేసి అలరించారు. పూరీ జగన్నాథ్ - ఆకాష్ ఇద్దరితో ఉన్న సాన్నిహత్యం కారణంగానే డార్లింగ్ ఈ సినిమా ప్రచారానికి తనవంతు మద్దతు ఇస్తున్నారని చెప్పవచ్చు.
పూరీ డైరెక్ట్ చేసిన 'బుజ్జిగాడు' 'ఏక్ నిరంజన్' సినిమాలు ప్రభాస్ కు మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అలానే 'బుజ్జిగాడు' సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ పాత్రను ఆకాష్ పోషించారు. అప్పటి నుంచే తమ మధ్య మంచి బాండింగ్ ఉందని ఆకాష్ చెబుతున్నారు. ''ప్రభాస్ గారికి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. 'రొమాంటిక్' ప్రమోషన్స్ కోసం మేం ఎవ్వరం కూడా ప్రభాస్ గారికి ఫోన్ చేయలేదు. ఆయనే ఫోన్ చేసి అడిగారు. అంత పెద్ద స్టార్.. మనం ఫోన్ చేసి అడుగుదామా? వద్దా? అని అనుకుంటుంటే.. ఆయనే ఫోన్ చేసి అడిగారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఒక రోజు మొత్తం మాకు ఇచ్చారు. ముంబైకి పిలిపించుకున్నారు. ఆయనతో ఉన్న ఆ ఒక్క రోజును ఎప్పటికీ మరిచిపోలేను. 'పదేళ్ల అనుభవం ఉన్న నటుడిలా చేశావ్' అంటూ నాకు ప్రభాస్ గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాంటి రెస్పాన్స్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది'' అని పూరీ ఆకాష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
కాగా, ''రొమాంటిక్'' చిత్రానికి పూరి జగన్నాథ్ కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందించారు. పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఇందులో ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా.. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. నరేష్ రానా సినిమాటోగ్రఫీ అందించారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరీ - ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.