బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? ఈ ప్రశ్నకు ఏడాదికో రెండేల్లకో జవాబు దొరుకుతుంది. కానీ ప్రభాస్ కు పెళ్లెప్పుడవుతుంది అనే ప్రశ్నకు మాత్రం చాలా ఏళ్లుగా జవాబు దొరకట్లేదు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది యంగ్ రెబల్ స్టార్ పెళ్లి. మూడేళ్ల ముందు ఈ ప్రశ్న అడిగితే బాహుబలి పూర్తయ్యాక అని జవాబిచ్చాడు ప్రభాస్. కానీ బాహుబలి కథ రెండు భాగాలైంది. ఫస్ట్ పార్ట్ కే మూడేళ్లు కరిగిపోయాయి.
ఇప్పుడిక రెండో పార్ట్ ఎప్పటికి పూర్తవుతుందో.. అది పూర్తయ్యాకైనా ప్రభాస్ పెళ్లి కథ తేలుతుందో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి మీద బాహుబలి సినిమాకు ముడిపెట్టి ఓ జోక్ తయారు చేశాడు ఎవరో చమత్కారి. శివగామి రమ్యకృష్ణ పెళ్లెప్పుడు చేసుకుంటావ్ అని బాహుబలి ప్రభాస్ అడగడం.. దానికి బాహుబలి పూర్తయ్యాక అని అతను బదులివ్వడం.. రానాను అడిగితే అతను కూడా అదే సమాధానం చెప్పడం.. కట్టప్ప ఇక వీళ్లిదరికీ పెళ్లి కాదు తల్లీ అనడం.. అంతా భలే తమాషాగా ఉంది. ఈ జోక్ ను రాజమౌళి కొడుకు కార్తికేయ ట్విట్టర్ లో షేర్ చేయడం విశేషం.