సాహో పాట దేనికి సంకేతం?

Update: 2019-07-09 04:31 GMT
ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాదు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. సాహో లాంటి గ్రాండ్ యాక్షన్ విజువల్ ట్రీట్ సినిమా అంటే ప్రేక్షకులు ఎంతో ఆశిస్తారు. ఏ చిన్న విషయంలోనూ నిర్లక్ష్యం ఉండదని నమ్ముతారు. కానీ దాన్ని నిలువునా వమ్ము చేస్తూ నిన్న విడుదలైన వీడియో సాంగ్ సైకో సయ్యా తీవ్రంగా నిరాశపరచడం హాట్ టాపిక్ గా మారింది.  దానికి తోడు పిక్చరైజేషన్ కూడా అంతంత మాత్రంగా ఉండటంతో డార్లింగ్ అభిమానులు దీని గురించి గర్వంగా చెప్పుకోలేకపోతున్నారు.

మిగిలిన పాటలు ఇలాగే ఉంటాయా లేక సం థింగ్ స్పెషల్ అనిపించేలా ఏదైనా మేజిక్ చేసుకుంటారా అనే టెన్షన్ వాళ్లలో మొదలైంది. శంకర్ ఎహసాన్ లాయ్ లు సాహో నుంచి తప్పుకున్నాక ఏవైతే అనుమానాలు వెల్లువెత్తాయో అవి నిజమయ్యే దిశగా సాహో మ్యూజిక్ లో ఫస్ట్ సాంగ్ రెస్పాన్స్ రావడం ఆలోచించాల్సిన విషయమే. 200 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా అంటే సంగీతం ఏ స్థాయిలో ఉండాలో అంచనాలు ఎలా ఉంటాయో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు.

అలాంటిది ఏదో రొటీన్ పబ్ సాంగ్ లాగా అర్థం కానీ పదాలతో వాయిద్యాల్లో కలిసిపోయిన గొంతులతో ఏదేదో చేశారు. ఫైనల్ గా ఇప్పుడీ నెగటివ్ మార్క్ పోవాలి అంటే ఇది రా పాట అంటే అనిపించే రేంజ్ వెంటనే మరో ఆడియో సాంగ్ వదలాలి. అప్పుడు కానీ ఈ డ్యామేజ్ రిపేర్ సాధ్యం కాదు. చూడాలి మరి ఏం చేస్తారో. ఇంకో నెల రోజులు మాత్రమే విడుదలకు టైం ఉంది. ఇప్పుడీ ప్రమోషన్ స్పీడ్ సరిపోదు. రెట్టింపు చేయాలి. మరి సాహో టీం ప్లాన్స్ ఎలా ఉన్నాయో వేచి చూడాలి.


Tags:    

Similar News