పెళ్లి గురించి ప్రభాస్ క్లారిటీ

Update: 2018-01-03 06:14 GMT
బాహుబలి తర్వాత ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్ గురించి తెలియని సినిమా ప్రేమికులు ఇండియాలో లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా వల్ల డార్లింగ్ ప్రభాస్ ఒక బ్రాండ్ లా మారిపోయాడు. ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ సాహో షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో తన పెళ్లి గురించి పూర్తిగా ఓపెన్ అయిపోయాడు. తనకు, అనుష్కకు పెళ్లి జరగబోతోందని కొన్ని మీడియా ఛానల్స్ - వెబ్ సైట్స్ లో చూశానని - అలాంటి పుకార్లు ఎలా ప్రచారం చేస్తారో తనకు అర్థం కావడం లేదని, తాను అనుష్క గొప్ప స్నేహితులమే తప్ప పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని కుండ బద్దలు కొట్టేసాడు. ఒక జంట వరసగా సినిమాల్లో నటించి బయట సన్నిహితంగా మెలిగినప్పుడు ఇలాంటి ప్రచారం జరగడం సహజమన్న ప్రభాస్ ఈ సంవత్సరం కూడా తన పెళ్లి లేదని తేల్చేసాడు.

ప్రభాస్ పెళ్లి గురించి గత రెండు మూడు నెలలుగా అదే పనిగా సర్కులేట్ అవుతున్న న్యూస్ పట్ల ప్రభాస్ స్పందించి మంచి పనే చేసాడు. ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవన్ని షేర్ చేసుకున్న ప్రభాస్ తాను ఎవరినైనా ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఏదైనా ఉంటే తానే చెప్పేవాడిని అని, లేని గర్ల్ ఫ్రెండ్ ని ఎక్కడి నుంచి తెమ్మంటారు అని ప్రభాస్ ప్రశ్నించడం విశేషం. అనుష్కతో ప్రభాస్ నాలుగు సినిమాల్లో నటించడం ఈ పుకార్లకు కారణం. అనుమతి రాక దుబాయ్ షెడ్యూల్ లేట్ అయిన సాహో టీం ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుతోంది. ఆ తర్వాత దుబాయ్ లో స్టంట్ మాస్టర్ కెన్ని బేట్స్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారు. ప్రభాస్ స్వయంగా చెప్పాడు కాబట్టి గాసిప్ వీరులు ఇకనైనా సైలెంట్ అవ్వడం మంచిది.
Tags:    

Similar News