ఎంత ఎత్తుకు ఎదిగినా.. మన మూలాలు మరిపోనిపోనివాడే అసలైన మనిషి అంటారు. మనం ఉన్నతంగా ఎదగడంలో సాయపడ్డ వారిపట్ల చాలా తక్కువమంది కృతజ్ఞత చూపిస్తారు. కానీ హీరో ప్రభాస్ అందరిలాంటి వాడు కాదు.. మనసున్న మంచి మనిషి అని మరోసారి నిరూపించుకున్నాడు. తను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సినిమాల్లో చాన్స్ లు ఇచ్చి లైఫ్ ఇచ్చిన ఎంఎస్ రాజుకు ఇప్పుడు ఇతోదికంగా సాయం చేసాడు.
ఎంఎస్ రాజు అంటే ప్రభాస్ కు ఎంతో అభిమానం.. ఆయన నిర్మించిన వర్షం - పౌర్ణమి సినిమాల్లో ప్రభాసే హీరో.. ఆ రెండు సినిమాలతో హిట్స్ కొట్టి ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకున్నాడు. అప్పట్లో బడా ప్రొడ్యూసర్ గా ఉన్న ఎంఎస్ రాజు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేక సినిమాలు తీయడం మానేశారు. అయితే తన కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా నిలబెట్టేందుకు అప్పులు చేసి మరీ సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ప్రభాస్ సుమంత్ అశ్విన్ బాధ్యతలను తీసుకున్నారు.
తాజాగా హ్యాపీవెడ్డింగ్ అనే సినిమాను ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో సుమంత్ అశ్విన్ హీరో కాగా.. మెగా డాటర్ కొణిదెల నిహారిక హీరోయిన్. ఎంఎస్ రాజుపై ఉన్న అభిమానంతోనే ఆయన కొడుకును హీరోగా పెట్టుకొని ప్రభాస్ సినిమా తీశాడు. ఏకంగా సినిమా పబ్లిసిటీ కోసమే కోటి ముప్పై లక్షలు ఖర్చు చేస్తున్నారట.. అంతేకాకుండా ఈ సినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మాత వంశీ దగ్గరుండి ఔట్ పుట్ బాగా వచ్చేందుకు ఖర్చుకు వెనుకాడడం లేదట. జూలైలో కాంపిటీషన్ లేని సమయంలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. మరి తన పాత ప్రొడ్యూసర్ కోసం ప్రభాస్ చేస్తున్న ఈ సాహసం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి..