'హ్యాండ్సమ్ నెస్' హై సర్.. అంటున్న ప్రభాస్ టీమ్!

Update: 2020-05-08 11:50 GMT
డార్లింగ్ ప్రభాస్.. గత కొన్నేళ్లుగా తన ప్రతీ సినిమాకి విభిన్నమైన క్యారెక్టర్లను, కొత్త కొత్త స్టైల్స్ ని పరిచయం చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే డార్లింగ్ - మిస్టర్ పర్ఫెక్ట్ - మిర్చి - సాహో లాంటి సినిమాలలో తన హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా చూపించి ఆకట్టుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలన్నీ భారీ లెవెల్ లోనే రూపొందించి వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి - సాహో లాంటి భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల తర్వాత డార్లింగ్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ డ్రామా మూవీలో నటిస్తున్నాడు. జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. డార్లింగ్ - మిర్చి - సాహో సినిమాలతో ప్రభాస్ కి విపరీతంగా లేడీ ఫాలోయింగ్ పెరిగింది.

అయితే ప్రతీ సినిమాలోను ప్రభాస్ ని ప్రేమిస్తూనే ఉన్నారనుకోండి. కానీ ఈ మధ్య డార్లింగ్ మరీ స్టైల్ గా కనిపించేసరికి గర్ల్స్ వాళ్ల మనసులు పారేసుకుంటున్నారు. ఇక తాజాగా రూపొందుతున్న సినిమాలో ప్రభాస్ ఇంతవరకు చూడని లుక్ లో కనిపిస్తాడని టాక్. అప్పటి పీరియాడిక్ టైంలో ఉండే లుక్స్ అండ్ నేటి ఆధునిక స్టైల్ తో.. కనిపిస్తాడని సమాచారం. 1960లోని గాఢమైన ప్రేమకథ కాబట్టి ఆ ట్రెండ్ కి, ఆధునిక ట్రెండ్ కి తగ్గ లుక్స్ డిజైన్ ప్రత్యేకంగా చేస్తున్నారట చిత్రయూనిట్. ప్రభాస్ ఇంతవరకు చూడని వైవిధ్యమైన లుక్ - బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తాడట. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ ప్రొడక్షన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ - తమిళ.. ఇతర బాషలలో రిలీజ్ కానుంది. డార్లింగ్ మిర్చి సినిమాల తర్వాత ఆ రేంజ్ హ్యాండ్సమ్ నెస్ తో లేడీ ఫ్యాన్స్ హార్ట్స్ కొల్లగొడతాడని చిత్ర బృందం చెప్తున్నారు. ఈ వార్త తెలిసే సరికి డార్లింగ్ లేడీ ఫ్యాన్స్ లో కాస్త ఆసక్తి మొదలైందని చెప్పాలి.
Tags:    

Similar News