`డార్లింగ్` ప్రభాస్ నటించిన `సాహో` ఈనెల 30న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఇప్పటివరకూ ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డుల్ని ఈ సినిమా వేటాడుతుందా? అంటూ సర్వత్రా ఆసక్తి గా మాట్లాడుకుంటున్నారు. అటు హిందీ మీడియాలోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ భారీ చిత్రంలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతోందో ఇప్పటికే ట్రైలర్.. పోస్టర్లు చెప్పాయి. బాహుబలి చిత్రంలో లుక్ కి పూర్తి భిన్నమైన లుక్ తో ప్రభాస్ కనిపిస్తున్నాడు. చూసేందుకు మ్యాకో మ్యాన్ లా కనిపిస్తున్నా.. అతడిలో లవర్ బోయ్ లుక్ కూడా కనిపిస్తోందని అభిమానులు ఖుషీగానే మాట్లాడుకుంటున్నారు.
`సాహో` కోసం ప్రభాస్ ప్రత్యేకించి అమెరికా వెళ్లి రూపురేఖల్ని మార్చుకునేందుకు ప్రత్యేకమైన డిజైనర్ లుక్ కోసం క్లాసులు తీసుకున్నాడని అప్పట్లో ముచ్చటించుకున్నారు. సెట్స్ కి వెళ్లకముందే తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకునేందుకు అతడు పక్కాగా ప్రిపేరయ్యాడు. అందుకే డార్లింగ్ ప్రభాస్ లో అన్ని రకాల వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. భారీ యాక్షన్ సీన్స్ లో ఎంతో స్టైలిష్ గా తన బాడీ లాంగ్వేజ్ ని ప్రెజెంట్ చేశారు ప్రభాస్. అలాగే శ్రద్ధా కపూర్ తో రొమాంటిక్ సీన్స్ లవ్ సీన్స్ లో అంతే ఛేంజోవర్ చూపించాడు. మ్యాకో మ్యాన్ కాస్తా ఉన్నట్టుండి లవర్ బోయ్ గా మారిపోయి కనిపిస్తున్నాడు. ఇలాంటి వేరియేషన్ చాలా అరుదుగా కొందరు హీరోల్లో మాత్రమే చూడగలం. సాహో చిత్రానికి భారీ యాక్షన్ ఛేజ్ లు ఎంత పెద్ద ప్లస్ కానున్నాయో.. ఇందులో మనసుకు హత్తుకునే ప్రేమకథను అంతే ఇదిగా తీర్చిదిద్దామని దర్శకుడు సుజీత్ చెబుతున్నారు.
తాజాగా డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించిన మరో కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ప్రభాస్ లవర్ బోయ్ తరహా వేషధారణతో స్మార్ట్ గా కనిపిస్తున్నారు. రౌండ్ నెక్ బ్లాక్ కలర్ టీస్ .. వైట్ ఇన్నర్ తో ఎంతో స్టైలిష్ గా ప్రభాస్ కోసమే డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ఆ కళ్లకు ధరించిన రౌండ్ ఫ్రేమ్ బ్లాక్ స్పెక్టకిల్స్ అంతే ఆకట్టుకుంటున్నాయి. ఈ లుక్ గాళ్స్ సామాజిక మాధ్యమాల్లో జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోతోంది.