పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ 'సలార్ 'తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ మ్యాన్లీ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 'కేజీఎఫ్' యాక్షన్ ని మించి 'సలార్' లో యాక్షన్ స్టంట్స్ పీక్స్ లో ఉంటాయని మరోవైపు అంతే జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభాస్ మ్యాన్లీ లుక్ కోసం ఎంతో శ్రమించాల్సి వస్తోంది అన్నది వాస్తవం.
'రాధేశ్యామ్' లో లవర్ బోయ్ పాత్ర నుంచి ట్రాన్సఫర్మేషన్ కష్టమైనప్పటికి తప్పని పరిస్థితి. అందుకోసం ప్రత్యేకమైన డైట్ ..నియమ నిబంధనలతో డార్లింగ్ లుక్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో జగపతి బాబు రాజ్ మన్నార్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. 'సలార్' లో ప్రభాస్-జగపతిబాబు పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ఇంటెన్స్ మోడ్ లో ఉంటాయని తెలుస్తోంది.
ఇంకా కొన్ని పాత్రలకు సంబంధించిన వివరాల్ని యూనిట్ గోప్యంగా ఉంచింది. అయితే ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముందుగా ఓ కీలక పాత్రకి లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ ఆలస్యం కావడం సహ పృథ్వీ రాజ్ ఇతర కమిట్ కారణాలుగా 'సలార్' నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
దీంతో ఆ పాత్రని ఎవరితో పుల్ ఫిల్ చేస్తారు? అన్న ప్రచారం అప్పట్లో సాగింది. అయితే ప్రభాస్..ప్రశాంత్ నీల్ పట్టుబట్టి పృథ్దీరాజ్ నే మళ్లీ ఒప్పించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలయాళం స్టార్ రివీల్ చేసారు. ప్రశాంత్ తో పాటు.. 'సలార్' నిర్మాతలతో మంచి పరిచయం ముందు నుంచి ఉంది. 'కేజీఎఫ్' ని మలయాళంలో నేనే రిలీజ్ చేసాను. గత ఏడాదే 'సలార్' లో నటించాలని ప్రశాంత్ అడిగారు.
పాత్ర నచ్చడంతో నేను కూడా అంగీకరించాను. కానీ తర్వాత వేర్వేరు కారణాలు సహా డేట్ల సమస్య తలెత్తడంతో తప్పుకున్నాను. కానీ తర్వాత ప్రశాంత్ తో పాటు ..ప్రభాస్ కూడా స్వయంగా నన్ను కలిసి సినిమా చేయాలని అడిగారు. దీంతో తప్పక డేట్లను సర్దుబాటు చేసుకుని 'సలార్' కోసం ఒప్పుకున్నానని తెలిపారు. పృథ్వీరాజ్ తొలిసారి తెలుగులో 'పోలీస్ పోలీస్' అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయలేదు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ 'సలార్' చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించబోతున్నారు.
'సలార్' లో ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణలో భాగంగా ఇద్దరి మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. శ్రుతి హాస్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ కి తల్లి పాత్రలో వెటరన్ నటి ఈశ్వరీ రావు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హంబాలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. కన్నడలో కేఆర్ జీ స్టూడియోస్.. తెలుగులో యూవీ క్రియేషన్స్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాయి.